Clocks Gift from God : వింత ఆచారం..సిగరెట్ వెలిగిస్తే ఈ దేవుడు కోరికలు తీరుస్తాడట..!!

మనకు ఏదన్నా కోరికలు ఉంటే..దేవుడికి ముడుపులు కట్టి వేడుకుంటాం. కానీ ఓ ఆలయంలో మాత్రం ఆ దేవుడి ముందు ‘సిగరెట్’వెలగించి కోరికలు చెప్పుకుంటే తీరుతాయట. ఆ కోరిక తీరాక భక్తులు ఓ గడియారం సమర్పించుకుంటే చాలట.

Clocks Gift from God : వింత ఆచారం..సిగరెట్ వెలిగిస్తే ఈ దేవుడు కోరికలు తీరుస్తాడట..!!

Watches Gift from God

Clocks Gift from God : సాధారణంగా దేవుడికైనా దేవతకైనా పువ్వుల, అరటి వంటి పండ్లు సమర్పించుకుంటారు. ఏవైనా కోరికలు ఉంటే దేవాలయం చుట్టూ ప్రదిక్షణలు చేసి కోరుకుంటాం. కానీ ఎన్నో ఆచారాలు..సంప్రదాయలు గల భారత్ లో ఎన్నో వింత ఆచారాలు ఉంటుంటాయి. మద్యాన్నే ప్రసాదంగా తీసుకునేదేవుడు. చాక్లెట్లను ప్రసాదంగా స్వీకరించే దేవత, మటన్ బిర్యానీనే ప్రసాదంగా పెట్టే దేవాలయం ఇలా భారతదేశంలోని వింత ఆచారాలు తెలిస్తే షాక్ అవుతాం. అటువంటిదే ఓ వింత ఆచారం ఇది..

మనకు ఏదన్నా కోరికలు ఉంటే..దేవుడికి ముడుపులు కట్టి వేడుకుంటాం.కానీ మధ్యప్రదేశ్‌లోని సాగస్‌ మహారాజ్‌ ఘడి వాలే బాబా ఆలయంలో మాత్రం దేవుడి ముందు ‘సిగరెట్’వెలగించి కోరికలు చెప్పుకుంటే తీరుతాయట. ఆ కోరిక తీరాక సదరు భక్తులు ఓ గడియారం సమర్పించుకుంటే చాలట.ఇక్కడ మరో వింత ఏమిటంటే పేరుకు ‘మహారాజ్‌ ఘడి వాలే బాబా ఆలయం’ అనేమాటే గానీ ఇక్కడ పెద్ద దేవాలయం అనేది ఉండదు. ఓ మర్రిచెట్టుకింద ఉంటుందీ ఆలయం. అలాగే ఇక్కడ పూజారులు కూడా ఎవ్వరు ఉండరు. యక్షుడే దేవుడుగా ఉంటాడని నమ్ముతారు. ఈ దేవాలయం..అలాగే మర్రిచెట్టు గడియాలతో నిండిపోయి ఉండటంతో ఆ ప్రాంతమంతా టిక్ టిక్ మనే శబ్ధం వినిపిస్తుంటుంది.

బిర్యానీకి ఫిదా : ఆ గుడిలో ప్రసాదం మటన్ బిర్యానీ

ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో అన్హెల్‌ రోడ్డు పక్కన ఓ మర్రి చెట్టు కింద ఈ సాగస్‌ మహారాజ్‌ ఘడి వాలే బాబా ఆలయం ఉంది. కోరుకున్న కోరికలు తీరిన అనంతరం.. భక్తులు ఈ గుడికి వచ్చి గడియారాలను ఘడి వాలే బాబాకు సమర్పిస్తారు. దీంతో అక్కడి రావి చెట్టు మొత్తం గడియారాలతో నిండిపోయింది.

Worship Shiva with crabs : ఆ దేవాలయంలో శివుడికి పీతలతో అభిషేకం..! వాటితోనే నైవేద్యం..!!

ఈ దేవాలయం గురించి గ్రామస్తులు మాట్లాడుతు..ఈ ఆలయం విశిష్టత 10 ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది.రెండేళ్లుగా బాగా ప్రసిద్ధి చెందింది. గడియారం దేవుడుగా ప్రసిద్ది చెందిన తరువాత చుట్టుపక్కల ప్రాంతాలవారు భారీగా వస్తుంటారని..అలా భక్తులు కట్టిన గడియాలతో ఆలయం, చెట్టు నిండిపోయిందని గడియారం కట్టటానికి స్థలమే లేనంతా ఈ చెట్టు నిండిపోయి ఉంటుందని తెలిపారు. టైమ్ బాగాలేనివారు ఇక్కడికొచ్చి సిగరెట్ వెలిగించి కోరికలు కోరుకుంటే నెరవేరతాయని ఆ తరువాత ఓ గడియారం పట్టుకొచ్చి ఇక్కడ కడతారని తెలిపారు. మొదటిసారిగా గడియారాన్ని ఎవరు విరాళంగా ఇచ్చారో ఎవరికీ తెలియదు.

మందు బాటిళ్లే ఆ దేవుడి నైవేద్యం : ఓల్డ్ మంక్ రమ్ తో భక్తుడి మొక్కు

గత రెండేళ్లుగా ఆలయంలో గడియారం పెట్టేందుకు కూడా స్థలం లేదని భక్తులు ఎన్నో గడియారాలు సమర్పించారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు నెరవేరుతూనే ఉన్నాయి.అలాగే గడియారాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఈ ఆలయానికి, మర్రిచెట్టుకు కట్టిన గడియారాలు ఎప్పుడూ దొంగిలించబడలేదట..

ట్రెండ్లీ : ఆ అమ్మవారికి నైవేద్యంగా పిజ్జా, బర్గర్,పానీపూరీ