Delhi liquor scam..ED Raids : బీజేపీ నీచ రాజకీయాల కోసం సీబీఐ, ఈడీ అధికారుల టైమ్ వేస్ట్ చేస్తోంది : కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. సీబీఐ, ఈడీ అధికారుల టైమ్ ను బీజేపీ వేస్ట్ చేస్తోంది అంటూ ఫైర్ అయ్యారు.

Delhi liquor scam..ED Raids : బీజేపీ నీచ రాజకీయాల కోసం సీబీఐ, ఈడీ అధికారుల  టైమ్ వేస్ట్ చేస్తోంది : కేజ్రీవాల్

CM Arvind Kejriwal fire on ED Raids in Delhi liquor scam

Delhi liquor scam..ED Raids : ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో గత కొన్ని నెలలుగా ఈడీ అధికారులు ఢిల్లీ ప్రముఖులతో పాటు పలు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ నేతలు..వ్యాపారవేత్తలు..ప్రముఖుల నివాసాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గత మూడు నెలలుగా లిక్కర్ పాలసీలో స్కామ్ జరిగిందంటూ బీజేపీ తెగ హడావిడి చేస్తోందని ఈడీతో దాడులు నిర్వహిస్తోందని కానీ దీంట్లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అవినీతికి పాల్పడ్డారని ఇప్పటి వరకు ఈడీ అధికారులు ఎటువంటి ఆధారాలు కనుగొనలేకపోయారని ..ఎందుకంటే అసలు అవినీతి జరిగితే కదా ఆధారాలు లభ్యం కావటానికి అంటూ బీజేపీపై మండిపడ్డారు కేజ్రీవాల్.

Delhi liquor scam..ED Raids : హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో మరోసారి ఈడీ సోదాలు

స్కామ్ అంటూ ఈడీ అధికారుల టైమ్ వేస్ట్ ను బీజేపీ వేస్ట్ చేస్తోంది అంటూ విమర్శించారు. బీజేపీ నీచరాజకీయాల కోసం ఈడీ అధికారుల సమయాన్ని వృధా చేస్తోంది అంటూ మండిపడ్డారు. మూడు నెలలుగా 500కంటే ఎక్కువగా సోదాలు నిర్వహించారని కానీ మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎక్కడా ఒక్క ఆధారాలను సాక్ష్యాలను కనుగొనలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. ఈ దాడుల్లో 300మందికి పైగా సీబీఐ,ఈడీ అధికారులు పాల్గొన్నారని కానీ ఎటువంటి ఆధారాలు లభించలేదని ఎందుకంటే మనీశ్ సిసోడియా ఎటువంటి అవినీతికి పాల్పడలేదని తేటతెల్లమవుతోంది అని అన్నారు కేజ్రీవాల్. కానీ బీజేపీ మాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సీబీఐ, ఈడీ అధికారుల సమయాన్ని వృథా చేస్తోంది అంటూ మండిపడ్డారు ఢిల్లీ సీఎం అరవింత కేజ్రీవాల్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరిగిన అవ‌క‌త‌వ‌క‌లు కేసులో ED  దేశవ్యాప్త దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈక్రమంలో మరోసారి పలు ప్రాంతాల్లో సోదాలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ తో సహా ఢిల్లీ, పంజాబ్ లలో 35 ప్రాంతాల్లో ఈడీ బృందాలు దాడుల్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఇండో స్పిరిట్స్ ఎండీ సమీర్ ఇచ్చిన సమాచారంతో పలువురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 20 విజయ్ నాయర్ కు..అక్టోబర్ 10 వరకు సమీర్ మహేంద్రు లకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కుంటున్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై సహా మరో 5 గురుపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రాబిన్ డిస్ట్రిలర్స్ పేరుతో రామచంద్రన్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరుతో పాటు హైదరాబాద్‌లో రామచంద్రన్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రామచంద్రన్‌కు సంబంధించిన కంపెనీతో పాటు ఇంట్లో కూడా ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.