Maha vs Karnataka: ఉద్ధవ్ థాకరే చేసిన డిమాండ్ మేరకు అసెంబ్లీ తీర్మానానికి సిద్దమైన సీఎం షిండే

సోమవారం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ‘‘మాకు కర్ణాటకకు చెందిన అంగుళం భూమి కూడా అక్కర్లేదు. కానీ మా భూభాగం మాకు కావాలి. మహారాష్ట్ర నుంచి కర్ణాటక ఆక్రమించిన భూమిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అసెంబ్లీలో ఈ రోజే తీర్మానం చేయాలి’’ అని డిమాండ్ చేశారు

Maha vs Karnataka: ఉద్ధవ్ థాకరే చేసిన డిమాండ్ మేరకు అసెంబ్లీ తీర్మానానికి సిద్దమైన సీఎం షిండే

CM Eknath Sinde to move resolution in assembly today

Maha vs Karnataka: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర అసెంబ్లీలో నేడు తీర్మానం చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭షిండే ప్రకటించారు. ఈ విషయమై అసెంబ్లీలో తీర్మానం చేయాలని శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేసిన మర్నాటే ముఖ్యమంత్రి షిండే నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే ఈ తీర్మానంపై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం తీర్మానం చేస్తోందని, ఇంతకు ముందు రెండున్నరేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారు ఏం చేయలేకపోయారంటూ ఉద్ధవ్ థాకరేని ఉద్దేశించి విమర్శించారు. ఈ తీర్మానం అసెంబ్లీ ఆమోదం పొందుతుందని తాను ఆశిస్తున్నట్లు ఫడ్నవీస్ అన్నారు.

Pragya Singh Thakur: ఇంట్లో కత్తుల్ని పదును చేసి పెట్టుకోండి, ఎందుకంటే.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

ఇక వివాదాస్పద ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటూ థాకరే చేసిన వ్యాఖ్యలపై మంత్రి దీపక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థాకరే ఉద్దశమేంటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే దీనిపై సీఎం షిండే సమాధానం చెప్తారని ఆయన అన్నారు. ఇక తాజా తీర్మానంపై సీఎం షిండే స్పందిస్తూ ‘‘మాకు ఎవరి నుంచి సలహాలు అక్కర్లేదు. ఈ వివాదంపై మా వైఖరి మాకు తెలుసు. దీని మీద మేము తీర్మానం చేసి అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నాం’’ అని అన్నారు.

Jyotiraditya Scindia- Minister Wear ‘chappal’ : 2నెలల తరువాత చెప్పులు ధరించిన రాష్ట్ర మంత్రి..స్వయంగా చెప్పులు అందించిన కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా

కాగా, సోమవారం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ‘‘మాకు కర్ణాటకకు చెందిన అంగుళం భూమి కూడా అక్కర్లేదు. కానీ మా భూభాగం మాకు కావాలి. మహారాష్ట్ర నుంచి కర్ణాటక ఆక్రమించిన భూమిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అసెంబ్లీలో ఈ రోజే తీర్మానం చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ఇదే విషయమై కొద్ది రోజుల క్రితం శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వివాదాస్పదంగా స్పందించారు. అవసరమైతే చైనా తరహాలో కర్ణాటకలో అడుగు పెడతామని రౌత్ బెదిరింపులకు పాల్పడ్డారు.