CM KCR : ఫ్రంట్ ఫుట్, చర్చల ఫలితాలు త్వరలోనే చూస్తారు – సీఎం కేసీఆర్

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన చర్చల్లో అన్ని విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు సానుకూలంగా సాగాయని చెప్పారు. ఇకపై అన్ని విషయాల్లో కలిసికట్టుగా..

CM KCR : ఫ్రంట్ ఫుట్, చర్చల ఫలితాలు త్వరలోనే చూస్తారు – సీఎం కేసీఆర్

Cm Kcr And Maharashtra Cm Uddhav Thackeray Press Meet

CM KCR And Maharashtra CM Uddhav Thackeray : బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై, ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం చేస్తున్నానన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. తన పోరును జాతీయ స్థాయికి తీసుకెళ్లే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన సమావేశంలో వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేసీఆర్, ఉద్ధవ్‌ ఠాక్రే మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఇక.. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. భేటీ అనంతరం వీరిద్దరూ మీడియా సమావేశం నిర్వహించారు. ఓ మంచి కార్యక్రమానికి తొలి అడుగు పడిందన్నారు సీఎం కేసీఆర్. త్వరలోనే నేతలమంతా హైదరాబాద్‌లో కలుస్తామని చెప్పారు.

Read More : CM KCR: మహా సీఎంతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన చర్చల్లో అన్ని విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు సానుకూలంగా సాగాయని చెప్పారు. ఇకపై అన్ని విషయాల్లో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్న కేసీఆర్.. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య 1000కి.మీ. సరిహద్దు ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాలు అనేక విషయాల్లో కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం దేశరాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న సీఎం.. దేశంలో అతిపెద్ద పరివర్తన రావాలన్నారు. దేశ యువతను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శివాజీ మహరాజ్‌, బాల్‌ఠాక్రే ఇచ్చిన స్ఫూర్తితోనే పోరాడాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

Read More : Maharashtra : ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్.. స్పెషల్ అట్రాక్షన్ ప్రకాష్ రాజ్

ఉద్ధవ ఠాక్రేతో జరిగిన చర్చల ఫలితాలను త్వరలోనే ప్రజలు చూస్తారని చెప్పారు కేసీఆర్. ఈ భేటీలో ప్రకాశ్ రాజ్ అంశం అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. ఎయిర్‌పోర్ట్ నుంచి ఠాక్రే ఇంటి వరకు ప్రకాశ్ రాజ్ ఉండటంపై పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. ఈ భేటీ తర్వాత.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‍‌తో కూడా సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. వీరిద్దరి మధ్య దేశ రాజకీయలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సర్కార్‌ పోతేనే దేశం అభివృద్ధి చెందుతుందంటున్న కేసీఆర్‌.. బీజేపీయేతర పార్టీల మద్దతు కూడగట్టే యత్నంలో పలు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. కోల్‌కతా, చెన్నై, బెంగళూరు త్వరలోనే వెళ్లనున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశం కానున్నారు.