KCR Delhi Tour Ends : రెండు రోజుల ముందే.. ముగిసిన కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. పలు పార్టీల నేతలను కలుసుకున్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు.

KCR Delhi Tour Ends : రెండు రోజుల ముందే.. ముగిసిన కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన

Kcr Delhi Tour Ends

KCR Delhi Tour Ends : తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. కేసీఆర్ బృందం హైదరాబాద్ చేరుకోనుంది. శుక్రవారం సాయంత్రం కేసీఆర్ బృందం ఢిల్లీకి వెళ్లింది. శనివారం ఉదయం యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్వోదయ విద్యాలయాన్ని, మొహల్లా క్లినిక్‌ని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్ సందర్శించారు. శనివారం రాత్రి ఎన్డీటీవీ అధినేత, ప్రముఖ జర్నలిస్ట్‌ ప్రణయ్‌రాయ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సుమారు గంటన్నరపాటు చర్చలు జరిపారు.

Cm Kcr: ముచ్చటగా మూడోసారి.. ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం కేసీఆర్..

అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు చంఢీగడ్‌ వెళ్లారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో కలిసి… అమరులైన రైతు, సైనిక కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు కేసీఆర్, కేజ్రీవాల్. ఇవాళ వ్యవసాయ ఆర్ధిక రంగ నిపుణుడు అశోక్‌ గులాటితో కేసీఆర్ భేటీ అయ్యారు‌. వ్యవసాయ రంగం, ఆహార ధాన్యాల కొరత వంటి పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.

CM KCR On Education : తెలంగాణలోనూ ఢిల్లీ తరహా విద్యా విధానం అమలు చేస్తాం-కేసీఆర్

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 25 వరకు కేసీఆర్ ఢిల్లీలో ఉండాల్సింది. పలు జాతీయ పార్టీల నేతలు, జాతీయ మీడియాకు సంబంధించిన వారితో భేటీ అవుతారని సీఎం కార్యాలయం ప్రకటించింది. కానీ, అకస్మాత్తుగా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ బయలుదేరారు కేసీఆర్.