BRS Office Delhi: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు సీఎం కేసీఆర్ ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్నిరిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయం లోపలికి అడుగు పెట్టారు.

BRS Office Delhi: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

BRS Office Delh

BRS Office Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ప్రారంభమైంది. వసంత్ విహార్ లో నిర్మించిన ఈ కార్యాలయం (బీఆర్ఎస్ భవన్‌) ను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయంను ప్రారంభించారు. అనంతరం లోపలికి అడుగు పెట్టారు. బీఆర్ఎస్ భవన్‌లో దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం ఆవరణంలో బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. కార్యాలయంలో వాస్తు‌పూజ, సుదర్శన హోమం నిర్వహించారు. ఈ పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యాలయంకు ఎడమ వైపు సమాజ్ వాదీ పార్టీ కార్యాలయం, కుడి వైపు జేడీయూ పార్టీ కార్యాలయం ఉంది.

Bandi Sanjay: పొంగులేటి ఇంటికి ఈటల రాజేందర్ వెళ్లే విషయం నాకు తెలియదు.. కాంగ్రెస్ ఆ ఒక్క ప్రకటనతో బీజేపీ గెలుపు ఖాయమైంది!

బీఆర్ఎస్ భవనం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌కు వెళ్లి కుర్చీలో కూర్చున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ భవనం నిర్మాణానికి సీఎం కేసీఆర్ 2021 సెప్టెంబర్ 2న భూమిపూజ చేశారు. ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, నాలుగు ప్రధాన కార్యదర్శుల చాంబర్‌లు ఉన్నాయి. మొదటి అంతస్తులో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు చాంబర్, ఇతర చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, 2, 3 అంతస్తుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి.  ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, వెంకటేశ్ నేత, కేశవరావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అయితే, ఈ కార్యాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కేసీఆర్ తొలి సమావేశం నిర్వహిస్తారు.

Ponguleti Srinivas Reddy: బీజేపీలోకి ఖాయమా? పొంగులేటి ఇంటికి బీజేపీ చేరికల కమిటీ.. పసందైన విందు ..

బీఆర్ఎస్ భవన్ విశేషాలు

* 1,300 గజాల్లో ఉన్న స్థలంలో 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవన నిర్మాణం.

* 2021 సెప్టెంబర్ 2 వతేదీన టీఆర్ఎస్ భవన్‌కు భూమి పూజ చేసిన కేసీఆర్.

* దీనిని ఎండీపీ ఎండీపీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది.

* మూడు అంతస్థుల్లో భవన నిర్మాణం.

* లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండవ, 3వ అంతస్తులతో కలిపి మొత్తం ఐదు అంతస్తుల ఉన్నాయి.

* లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‭లో మీడియా హాలుతో పాటు రెండు గదులు

* లోయర్ గ్రౌండ్లోకి వచ్చే మీడియాకు వీలుగా ఉండేలా ప్రత్యేక ఎంట్రెన్స్ ఏర్పాటు.

* గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, కార్యకర్తలు, నాయకుల కోసం క్యాంటీన్ ఏర్పాటు

* మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్, పేషీ, కాన్ఫరెన్స్ హాల్

* 2,3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందుకు 20 గదులు, ఇందులో రెండు ప్రత్యేక సూట్ రూమ్స్

* పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి సూట్ రూంలలోనే బస