కేజ్రీవాల్ భార్యకు 3 ఓటర్ కార్డులు : కోర్టులో కంప్లయింట్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య పేరుతో మూడు ఓటరు ఐడీ కార్డులున్నాయని బీజేపీ నేత హరీశ్ ఖురానా తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు చేశారు.

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 08:21 AM IST
కేజ్రీవాల్ భార్యకు 3 ఓటర్ కార్డులు : కోర్టులో కంప్లయింట్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య పేరుతో మూడు ఓటరు ఐడీ కార్డులున్నాయని బీజేపీ నేత హరీశ్ ఖురానా తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు చేశారు.

2019 లోక్ సభ ఎన్నికల వేళ.. పలు అంశాలు ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య పేరుతో మూడు ఓటరు ఐడీ కార్డులున్నాయని  బీజేపీ నేత హరీశ్ ఖురానా తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు చేశారు.
 

ఢిల్లీలోని సివిల్ లేన్స్, ఘజియాబాద్‌లోని సాహిబాబాద్‌తో పాటు..  సీఎం నివాసం ఉంటున్న చాందిని చౌక్‌లో కూడా కేజ్రీవాల్ భార్య సునీత పేరుమీద ఓటర్ ఐడీలు ఉన్నట్టు హరీశ్ ఆరోపించారు. ఇది చట్ట విరుద్ధమన్నారు. ఐపీసీతో పాటు ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని.. సునీతకు నోటీసులు జారీచేయాలని కోర్టును కోరారు.
 

కాగా హరీశ్ ఆరోపణలపై సీఎం కేజ్రీవాల్, సునీతా కేజ్రీవాల్ లతో సహా పార్టీ నేతలెవరూ స్పందించలేదు. ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్‌కు రెండు ఓటర్ కార్డులు ఉన్నాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషి ఆరోపించారు. ఈ క్రమంలోనే సీఎం కేజ్రీవాల్ భార్య సునీత ఓటర్ ఐడీల వ్యవహారం వెలుగుచూసింది.