Subhash Chandra Bose: నేతాజీ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలన్న మమతా బెనర్జీ

జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Subhash Chandra Bose: నేతాజీ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలన్న మమతా బెనర్జీ

Suabsh Chandra Bose

Subhash Chandra Bose: జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా..ఆయన జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆదివారం కోల్‌కతాలో సీఎం మమతా నివాళి అర్పించారు. అనంతరం ట్విట్టర్ వేదికగా మమతా స్పందిస్తూ.. ప్రధాని మోదీకి వరుస ట్వీట్లు పెట్టారు. భరత జాతి గర్వించదగ్గ నేతగా, భవిష్యత్ తరాలవారు ఆయన్ను స్మరించుకునేలా సుభాష్ చంద్రబోస్ జయంతిని (జనవరి 23) జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని సీఎం మమతా బెనర్జీ కోరారు. “ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్నీ తమ దృష్టికి తీసుకువచ్చాం, మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, నేతాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించండి. ప్రజలందరూ ఆయనకు నివాళి అర్పించేందుకు వీలుంటుంది” అంటూ మమతా ట్వీట్ చేశారు.

Also read: Fever Survey: తెలంగాణలో మూడో రోజుకు చేరుకున్న ఫీవర్ సర్వే

స్వాతంత్ర పోరాట సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బెంగాల్ నుంచి ఎన్నో కార్యకలాపాలు నడిపించేవారని..బెంగాల నుంచే ఆయన పోరాటం ఊపిరి పోసుకుందని మమతా వ్యాఖ్యానించారు. నేతాజీ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని “దేశ్ నాయక్ దిబాస్” పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు మమతా పేర్కొన్నారు. నేతాజీ స్మారకార్థం బెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో “జై హింద్ జాతీయ యూనివర్సిటీ”ని నెలకొల్పనున్నట్లు మమతా తెలిపారు. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుందని, అంతర్జాతీయ సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలిపారు.


Also read: Crime Hyderabad: నగరంలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులపై కత్తులతో దాడి