CM Mamata Banerjee: పశ్చిమబెంగాల్ సీఎం కీలక నిర్ణయం.. వారం రోజులు అన్ని విద్యాసంస్థలు బంద్ ..

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గత కొద్దిరోజులుగా పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత తలనొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఫిర్యాదులొచ్చాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ అన్నారు.

CM Mamata Banerjee: పశ్చిమబెంగాల్ సీఎం కీలక నిర్ణయం.. వారం రోజులు అన్ని విద్యాసంస్థలు బంద్ ..

Heatwave in Bengal

CM Mamata Banerjee: వేసవికాలం వచ్చేసింది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. పలు ప్రాంతాల్లో 40డిగ్రీలుదాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలుదాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారంరోజుల పాటు రాష్ట్రంలోని స్కూళ్లు, విశ్వవిద్యాలయాలతోసహా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని మమతా బెనర్జీ కోరారు.

Mamata Banerjee: బెంగాల్‭లో అల్లర్లకు బిహార్ గూండాల్ని తెచ్చిన బీజేపీ.. మమత సంచలన ఆరోపణలు

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గత కొద్దిరోజులుగా పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత తలనొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఫిర్యాదులొచ్చాయని మమత తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు రావద్దని ఆమె ప్రజలను కోరారు. రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదవుతున్నాయని, ఏప్రిల్ 19వరకు హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణంశాఖ అంచనా వేసింది.

Maharashtra Heatstroke : అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో విషాదం.. 11 మంది మృతి, వందమందికిపైగా అస్వస్థత

దేశ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రంలో ప్రభుత్వం ఆదివారం ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఎండల తీవ్రత ఎక్కవగా ఉన్నప్పటికీ టెంట్లు ఏర్పాటు చేయకపోవటంతో ప్రజలు ఎండలోనే నాలుగు గంటల పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో, వీరిలో వంద మందికిపైగా వడదెబ్బ తగిలింది. 11మంది మరణించగా.. మిగిలినవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.