పెళ్లిలో దీదీ డ్యాన్స్ : ఫ్రైర్‌బ్రాండ్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 09:34 AM IST
పెళ్లిలో దీదీ డ్యాన్స్ : ఫ్రైర్‌బ్రాండ్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే ఫైర్ బ్రాండ్. కానీ ఆమెలో మరోకోణం కూడా ఉంది. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే దీదీ..నిరంతరం రాజకీయ కార్యక్రమంలో బిజీ బిజీగా ఉండే దీదీ ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ వేసి..ఔరా..దీదీ ఇలా కూడా ఉంటారా? అనిపించారు. మమతా బెనర్జీ వేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మల్డా నగరంలో ఇటీవల ఓ సామూహిక వివాహాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. కొత్త జంటలకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అయితే కరోనా బెడద భయపెడుతున్న క్రమంలలో ఇలా సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చా అనే సందేహాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. కరోనా అయినా దాని తాత అయినా దీదీ చేయాలనుకుంటే ఆమెను ఎవరూ ఆపలేరు..దటీజ్ ఫ్రైర్ బ్రాండ్ దీదీ..

See Also | డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన 10నిమిషాలకే యాక్సిడెంట్ చేసేశాడు