మాస్కులతో అసెంబ్లీకి వచ్చిన సీఎం, ఎమ్మెల్యేలు

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైంది. ఇవాళే బలపరీక్ష అని గవర్నర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయిదే దీనిపై స్పీకర్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

  • Published By: veegamteam ,Published On : March 16, 2020 / 05:49 AM IST
మాస్కులతో అసెంబ్లీకి వచ్చిన సీఎం, ఎమ్మెల్యేలు

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైంది. ఇవాళే బలపరీక్ష అని గవర్నర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయిదే దీనిపై స్పీకర్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైంది. ఇవాళే(మార్చి 16,2020) బలపరీక్ష అని గవర్నర్ ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. అయిదే దీనిపై స్పీకర్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. గుర్గావ్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో కమల్ నాథ్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. బలపరీక్ష ఎప్పుడు పెట్టినా నెగ్గుతామని సర్కార్ అంటోంది. బలపరీక్షపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది.

మాస్కులతో అసెంబ్లీకి:
కాగా సీఎం కమల్ నాథ్ సహా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది మాస్కులతో సభకు వచ్చారు. కరోనా భయంతో అంతా మాస్కులు ధరించారు. ప్రతి ఒక్కరు మాస్కులు వేసుకునే సభకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సహా ఎమ్మెల్యేలంతా మాస్కులతో కనిపించారు. మన దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా సభ్యులంతా మాస్కులు ధరించారు. 

బలపరీక్ష జరిగితే ఏమవుతుంది?
మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం ముదిరింది. రాష్ట్ర రాజకీయాల్లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో నేడు బలపరీక్ష ఉండే అవకాశం కనిపిస్తోంది. సోమవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశం అయ్యింది. గవర్నర్ ప్రసంగం, తర్వాత ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అయితే అసెంబ్లీ బిజెనెస్ జాబితాలో “బలపరీక్ష” లేకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కమల్ నాథ్ ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగుర వేసి బెంగళూరు క్యాంపులో గడిపిన ఎమ్మెల్యేలు అందరూ భోపాల్‌ చేరుకున్నారు. ఇవాళే విశ్వాస పరీక్ష పెడితే ఏం జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. 

ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాతో సంక్షోభం:
ఎమ్మెల్యేలు, మంత్రుల రాజీనామాలతో కాంగ్రెస్ సర్కార్ క్రైసిస్ లో పడింది. సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్​ లాల్ జీ టాండన్ ​స్పీకర్​ను ఇప్పటికే ఆదేశించారు. దీనిపై ముందస్తుగా ప్రకటనలు చేయబోనని, తన నిర్ణయం ఏమిటన్నది సభలోనే చెబుతానని స్పీకర్​ ఎన్​పీ ప్రజాపతి చెప్పారు. ఫ్లోర్​ టెస్టు జరుగుతుందనే వార్తలతో క్యాంపులకు తరలించిన ఎమ్మెల్యేలను బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు వెనక్కి రప్పించాయి. 

విశ్వాస పరీక్షకు గవర్నర్ ఆదేశం:
మధ్యప్రదేశ్ గవర్నర్​ లాల్​జీ టాండన్​ సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని స్పీకర్​ను ఆదేశించారు. సోమవారం ఉదయం 11 గంటలకు మధ్యప్రదేశ్​ అసెంబ్లీ సెషన్ ప్రారంభమవుతుందని, తన ప్రసంగం ముగిసిన వెంటనే విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్​ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ ప్రతినిధులు గవర్నర్​ను కలిసి సాధ్యమైనంత త్వరగా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని కోరారు. ఇది జరిగిన కొద్ది గంటలలోపే గవర్నర్​ విశ్వాస పరీక్షకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని మంత్రి శర్మ చెప్పారు.

22మంది రాజీనామాతో సంక్షోభం:
కొన్నిరోజుల క్రితం జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో కమల్​నాథ్​ సర్కారుకు ఇబ్బందులు మొదలయ్యాయి. మెజారిటీ మార్కును తగ్గించేందుకు ఆరుగురు మినిస్టర్లు సహా 22 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రుల రాజీనామాలను స్పీకర్​ నర్మదా ప్రసాద్​ ప్రజాపతి శనివారం ఆమోదించారు. ఒక వేళ మిగతా 16మంది ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా స్పీకర్​ ఆమోదిస్తే.. 107 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా అవతరిస్తుంది. మంత్రుల రాజీనామాల ఆమోదం తర్వాత అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 222కు తగ్గనుంది. దీంతో మెజార్టీ మార్కు 112కు తగ్గింది. పార్టీలో తిరుగుబాటుకు ముందు 114 మంది సభ్యులున్న కాంగ్రెస్​ పార్టీ బలం ప్రస్తుతం 92. ఆ పార్టీకి నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే సపోర్ట్​ ఉంది. ప్రస్తుతం బీజేపీ బలం 107. మెజారిటీకి ఆ పార్టీకి ఇంకా ఐదుగురు సభ్యులు కావాలి. రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతు ఎవరికి ఉంటుందనే దానిపై కమల్​నాథ్ సర్కారు భవిష్యత్తు ఆధారపడి ఉంది.

See Also |  CAA వద్దే వద్దు: గోలీ మారో సాలోంకు అంటారా ? ఏం భాష – కేసీఆర్