అమరుల కుటుంబానికి 20 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం

  • Published By: venkaiahnaidu ,Published On : February 16, 2019 / 09:58 AM IST
అమరుల కుటుంబానికి 20 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన తమిళనాడుకి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఒకరు చొప్పున రెండు కుటుంబాల్లోని ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. భాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఆర్థికసాయాన్ని శుక్రవారం సీఎం పళనిస్వామి ప్రకటించారు.

 జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలోగురువారం(ఫిబ్రవరి-14,2019) జరిగిన ఉగ్రదాడిలో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అమరులైన 49మందిలో తమిళనాడుకి చెందిన సుబ్రమణియన్,శివచంద్రన్ లు కూడా ఉన్నారు. సుబ్రమణియన్ స్వస్థలం తూతుక్కుడి జిల్లాలోని సవలపెరి గ్రామం. ఐదేళ్ల క్రితం సుబ్రమణియన్ సీఆర్పీఎఫ్ లో చేరాడు. ఏడాదిన్నర క్రితం క్రిష్ణవేణితో వివాహం అయింది. గురువారం మధ్యాహ్నాం 2గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసి డ్యూటీ మీద వేరే ప్లేస్ కి వెళ్తున్నానని చెప్పాడని, అవే చివరి మాటలు అవుతాయని తాను అనుకోలేదని సుబ్రమణియన్ భార్య క్రిష్ణవేణి కన్నీరుమున్నీరయింది.

శివచంద్రన్ స్వస్థలం అరియాలూర్ జిల్లాలోని కార్కుడి గ్రామం. శివచంద్రన్ కి  ఓ భార్య గాంధీమథి, రెండేళ్ల కొడుకు శివమునియన్ ఉన్నారు. గాంథీమతి ఇప్పుడు నాలుగు నెలల ప్రెగ్నెంట్. చివరిసారిగా శివచంద్రన్ తో మాట్లాడిన క్షణాలను గుర్తుచేసుకుంటూ కుటుంబం కన్నీరుమున్నీరయింది.