Pinarayi On Agnipath : అగ్నిపథ్‌ను నిలిపివేయాలంటూ ప్రధాని మోదీకి సీఎం లేఖ
అగ్నిపథ్ పథకాన్ని వాయిదా వేయాలంటూ నేరుగా ప్రధానికి లేఖ రాశారు. తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని నిలిపివేయాలని.. యువతలో నెలకొన్న ఆందోళనలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

Pinarayi Vijayan On Agnipath : భారత సైన్యంలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. యువత రోడ్డెక్కి ఆందోళన బాట పట్టింది. పలు చోట్ల ఆందోళనలు హింసకు దారితీశాయి. రైల్వే ఆస్తులు టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు. దీంతో రైల్వేశాఖకు భారీగా నష్టం వాటిల్లుతోంది.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ఈ క్రమంలో అగ్నిపథ్ స్కీమ్ ని ఉద్దేశించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అగ్నిపథ్ పథకాన్ని వాయిదా వేయాలంటూ నేరుగా ప్రధానికి లేఖ రాశారాయన. తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని నిలిపివేయాలని కోరిన విజయన్.. యువతలో నెలకొన్న ఆందోళనలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అగ్నిపథ్ పథకంపై పునరాలోచన చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు పినరయి విజయన్.
Agnipath : కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్..సాధారణ రిక్రూట్ మెంట్ లేదు : రక్షణ శాఖ
కాగా, ఈ పథకంపై తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధినేతలతో వరుసగా రెండో సారి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆదివారం మీడియా ముందుకు వచ్చిన త్రివిధ దళాల అధిపతులు… అగ్నిపథ్ పథకంపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా అగ్నివీర్లకు లభించే సౌలభ్యాలను కూడా వివరించారు.
Priyanka Gandhi: యువత బాధను అర్థం చేసుకోండి.. గతంలో నేను లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు..
ఓ వైపు త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరుస భేటీలు నిర్వహిస్తూ ఉంటే.. మరోవైపు అగ్నిపథ్ పథకాన్ని నిలిపివేయాలంటూ కేరళ సీఎం లేఖ రాయడం చర్చకు దారితీసింది.
- Hyderabad: ‘విజయ సంకల్ప’ సభకు హాజరైన గద్దర్.. బీజేపీ తీర్థంపుచ్చుకోనున్న విశ్వేశ్వరరెడ్డి
- PM Modi: పరేడ్ గ్రౌండ్‌కు మోదీ ఏ సమయానికి చేరుకుంటారంటే..
- PM Modi Meeting: విజయ సంకల్ప సభ భారీ కవరేజ్‌కు కమలనాథుల ప్లాన్
- KA Paul: ఎకనామిక్ సమ్మిట్ పెట్టండంటే మోదీ పెట్టడం లేదు.. 8లక్షల కోట్లు తెస్తా
- Hyderabad Metro: సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8గంటల వరకు ఆ మూడు స్టేషన్లలో మెట్రో సేవలు బంద్
1IndiavsEngland: మ్యాచ్‌పై పట్టు బిగిస్తున్న భారత్.. 250 దాటిన ఆధిక్యం
2Jasprit Bumrah Stunning Catch : వావ్.. ఎక్స్లెంట్.. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన బుమ్రా.. వీడియో వైరల్
3Money Plant: మనీ ప్లాంట్ పెంపకంపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది
4Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Pakistan Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 19మంది మృతి
6Telangana: 10 సభలు పెట్టినా బీజేపీని ఎవరూ నమ్మరు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
7Rains In Telangana : రాగల 24 గంటల్లో అల్పపీడనం-తెలంగాణలో పలు జిల్లాలలో వర్షాలు
8Gold Theft : కేజీన్నర బంగారం చోరీని చేధించిన పోలీసులు
9Texas shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
10bjp: కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంది: జేపీ నడ్డా
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు