CM Stalin : ప్రాణాలు కోల్పోయిన 43 మంది వైద్యుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం

తమిళనాడు రాష్ట్రంలో వైరస్ సోకి..43 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ - 19 రోగుల చికిత్సలో పాల్గొన్న వైద్య సేవా సిబ్బందికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.

CM Stalin : ప్రాణాలు కోల్పోయిన 43 మంది వైద్యుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం

Stalin

Rs 25 lakh compensation : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మాములుగా లేదు. వైరస్ జోరుగా విస్తరిస్తోంది. ప్రమాద ఘంటికలను మ్రోగిస్తోంది. పాజిటివ్ లక్షల్లో ఉండడం, మరణాల సంఖ్య వేలల్లో ఉండడం అందర్నీ కలవరపెడుతోంది. కోవిడ్ – 19 కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా…ఫలితం ఏ మాత్రం రావడం లేదు.

ప్రధానంగా..కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు సైతం మరణిస్తున్నారు. ఆయా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఇతరులను కాపాడుదామని చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది మృతి చెందుతుండడం అందర్నీ బాధిస్తోంది. అయితే..వీరి కుటుంబాలకు అండగా ఉంటామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రంలో వైరస్ సోకి..43 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల పరహారం ప్రకటించారు.

కోవిడ్ – 19 రోగుల చికిత్సలో పాల్గొన్న వైద్య సేవా సిబ్బందికి ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఏప్రిల్, మే, జూన్ అంటే..మూడు నెలలకు వైద్యులకు రూ. 30 వేలు, నర్సులు, ట్రైనీ వైద్యులకు రూ. 20 వేలు, శానిటరీ కార్మికులు, సిటీ స్కాన్ విభాగం, అంబులెన్స్ వర్కర్లకు రూ.15 వేలను ప్రోత్సాహకంగా అందచేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు.

ఇక కరోనా విషయానికి వస్తే..ఈ రాష్ట్రంలో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే 29 వేల 272 కేసులు రికార్డయ్యాయి. 298 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,38,509గా ఉంది. 19 వేల 182 మంది డిశ్చార్జ్ అయ్యారు.