లాక్‌డౌన్ ఉండదు.. ఆంక్షలు మాత్రమే.. రాత్రి 8గంటల నుంచి…

లాక్‌డౌన్ ఉండదు.. ఆంక్షలు మాత్రమే.. రాత్రి 8గంటల నుంచి…

Uddhav

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ అప్రమత్తం అవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉదృతి బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌పై మాట్లాడిన ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే.. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించట్లేదని, ఆంక్షలు మాత్రం లాక్‌డౌన్‌లో ఉన్నట్లు ఉండబోతున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండగా.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉద్ధవ్‌ వివరించారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా రేపు(14 ఏప్రిల్ 2021) రాత్రి 8 గంటల నుంచి లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15రోజుల పాటు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాత్రి 8గంటల నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ ఉంటుందని, ఉదయం వేళలో 144సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

మహారాష్ట్రలో కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరత ఉందని, రెమిడెసివిర్‌ ఔషధానికి డిమాండ్‌ పెరుగుతోంది. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు క్రమంగా పెంచుతున్నట్లు చెప్పారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.