MP Navneet Rana: అధికార దుర్వినియోగానికి పాల్పడి మాపై దేశద్రోహం కేసు: ఉద్ధవ్ థాకరేపై ఎంపీ నవనీత్ ఫైర్

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనపై, తన ఎమ్మెల్యే భర్తపై రాజద్రోహం కేసు పెట్టడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అమరావతి పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా ఆరోపించారు

MP Navneet Rana: అధికార దుర్వినియోగానికి పాల్పడి మాపై దేశద్రోహం కేసు: ఉద్ధవ్ థాకరేపై ఎంపీ నవనీత్ ఫైర్

Navneet

MP Navneet Rana: మహారాష్ట్రలో అధికార శివసేన, మరియు ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ రాణా దంపతుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనపై, తన ఎమ్మెల్యే భర్తపై రాజద్రోహం కేసు పెట్టడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అమరావతి పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా ఆరోపించారు. ఆదివారం మహారాష్ట్రలోని అమరావతిలో ఆమె మాట్లాడుతూ..పురుషులు మహిళలను ముందుండి నడిపిస్తున్న మన దేశంలో సీఎం ఉద్ధవ్ థాకరే విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని నవనీత్ రాణా ఆరోపించారు. సీఎం అయిన థాకరే ఆయన స్థాయికి దిగజారి మాపై దేశద్రోహం కేసు పెట్టారని నవీనీత్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Other Stories:Assam floods: అసోంలో వరదలు.. ముగ్గురు మృతి

2019లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం దిగిపోయిన నాటి నుంచి అధికారంలోకి వచ్చిన శివసేన పాలనలో మహారాష్ట్రలో నిరుద్యోగం మూడు రెట్లు పెరిగిందని ఆమె ఆరోపించారు. నిరుద్యోగం మరియు లోడ్ షెడ్డింగ్ సమస్యలతో పోరాడుతున్న పేదలు మరియు నిస్సహాయుల సమస్యలను తొలగిపోయి, సీఎం ఉద్ధవ్ థాకరేకు మంచి బుద్ధి ప్రసాదించేలా హనుమాన్ చాలీసాను పఠించాలని తాను కోరుకున్నట్లు ఎంపీ నవనీత్ రాణా చెప్పారు. ముంబైలోని బాంద్రాలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వ్యక్తిగత నివాసం ‘మాతోశ్రీ’ వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తామని ప్రకటించిన అమరావతి లోక్సభ ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త, బద్నేరా ఎమ్మెల్యే రవి రాణాలను ముంబై పోలీసులు ఏప్రిల్ 23న అరెస్టు చేశారు.

Other Stories:Gautam Adani: రాజ్యసభ సీటు వార్తలపై అదానీ క్లారిటీ

రాజద్రోహం మరియు వివిధ వర్గాల్లో విద్వేషాలు రెచ్చగొట్టారంటూ వారిపై కేసు నమోదు చేశారు. మే 4న ప్రత్యేక కోర్టు రాణా దంపతులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసు కస్టడీలో ఉన్న తమపై పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారని ఆరోపించిన నవనీత్ రాణా, ఉద్ధవ్ ప్రభుత్వం “ప్రతీకార రాజకీయాలు” చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.