Yogi Adityanath : సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ రోజు 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి, లక్నో ఎంపీ, రాజ్‌నాథ్ సింగ్ సీఎం ఆదిత్యనాథ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.

Yogi Adityanath : సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

Yogi Adityanath

Yogi Adityanath :  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ రోజు 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి, లక్నో ఎంపీ, రాజ్‌నాథ్ సింగ్ సీఎం ఆదిత్యనాథ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, మరో ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మలు ట్విట్టర్ ద్వారా సీఎం ఆదిత్యనాథ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

వీరితో పాటు పలువురు మంత్రులు, అధికారులు సీఎం నివాసానికి వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా తన పుట్టినరోజు వేడుకలు  నిర్వహించవద్దని పార్టీ నేతలకు ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు.

ఉత్తరాఖండ్ లోని   పౌరి గర్వ్హాల్   జిల్లాలోని పంచూరు గ్రామంలో 1972 జూన్ 5న యోగీ ఆదిత్యనాథ్ జన్మించారు. ఆయనకు తల్లితండ్రులు పెట్టిన పేరు అజయ్ సింగ్ బిష్ట్. అయితే ఆయన దీక్ష తీసుకున్న తర్వాత తన పేరును యోగి ఆదిత్యనాథ్ గా మార్చుకున్నారు. కాగా గోరఖ్ పూర్ నుంచి వరుసగా ఐదు సార్లు ఎంపీగా గెలిచిన ఆదిత్యనాథ్ హిందుత్వ వాదిగా, ఫైర్ బ్రాండ్ గా పేరుపొందారు.

ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్. ఫారెస్ట్ రేంజర్ గా పని చేసేవారు. గతేడాది ఆయన కన్నుమూశారు. తల్లి సావిత్రిదేవి. ఏడుగురు తోబుట్టువులలో ఆదిత్యనాథ్ ఐదవ వారు. ఆయనకు ముగ్గురు అక్కలు ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు.

1993లో ఆదిత్యనాథ్‌కు మహంత్ అవిద్యనాథ్ తో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రభావంతో గోరఖ్ పూర్ వెళ్లారు. ఆయన వద్ద నుంచి సన్యాస దీక్ష పొంది పేరు మార్చుకున్నారు. మహంత్ అవిద్యనాథ్ మరణం తర్వాత ఆదిత్యనాథ్ ను మహంత్ చేశారు.

26 ఏళ్ల వయస్సులో 1998 లో మొదటి సారి గోరఖ్ పూర్ నుంచి బీజేపీ టికెట్ మీద గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. అప్పటికి లోక్‌సభలో ఉన్న ఎంపీలలో అందరికంటే అతిపిన్న వయస్కుడు యోగి ఆదిత్యనాథ్. ఆ తర్వాత వరుసగా 1999, 2004, 2009, 2014 లో లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు.

పూర్వాంచల్ లోమంచి పట్టుఉన్ననాయకుడిగా పేరు పొందిన యోగీని  2017 అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ ప్రకటించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటంతో బీజేపీ అధినాయకత్వం ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టింది.