అయోధ్యలో మందిరం కాంగ్రెస్ కు ఇష్టం లేదు…యోగి

  • Published By: venkaiahnaidu ,Published On : December 5, 2019 / 12:43 PM IST
అయోధ్యలో మందిరం కాంగ్రెస్ కు ఇష్టం లేదు…యోగి

అయోధ్యలో రామమందిరం నిర్మించయడం కాంగ్రెస్,ఆర్జేడీ, జేఎంఎం పార్టీలకు ఇష్టం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. అందుకే ఆ పార్టీలు ఎప్పుడూ రామ మందిరంపై పోరాడలేదని అన్నారు. అందుకనే ఈ సమస్య శతాబ్దాల కొద్దీ కోర్టులో దివాలా తీసినట్లు యూపీ సీఎం తెలిపారు. 

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లో ఇచ్చాఘర్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో యోగి మాట్లాడారు. 500 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న అయోధ్య వివాదాన్ని బీజేపీ ఎలాంటి వివాదం లేకుండా, అతి సున్నితంగా పరిష్కరించిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి దేశంలో అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయన్నారు.

జార్ఖండ్‌ ప్రజలు ఆలోచించి, తమ విలువైన ఓటును బీజేపీకి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని యోగి కోరారు. కశ్మీర్‌ సమస్య ఎంత కఠినమైనదో అందరికీ తెలుసునని, అలాంటి సమస్యను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ద్వయం చాలా పకడ్బందీగా, ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా పరిష్కరించారన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందని ఆదిత్యనాథ్ అన్నారు.