స్టూడెంట్ సూటి ప్రశ్న.. ఎక్కెక్కి ఏడ్చిన యోగి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆధిత్యనాథ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ అడిగిన సూటిప్రశ్నకు యోగి కన్నీటిపర్యంతమయ్యారు.

  • Published By: sreehari ,Published On : February 23, 2019 / 02:07 PM IST
స్టూడెంట్ సూటి ప్రశ్న.. ఎక్కెక్కి ఏడ్చిన యోగి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆధిత్యనాథ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ అడిగిన సూటిప్రశ్నకు యోగి కన్నీటిపర్యంతమయ్యారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆధిత్యనాథ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ అడిగిన సూటిప్రశ్నకు యోగి కన్నీటిపర్యంతమయ్యారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది CRPF జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. శుక్రవారం (ఫిబ్రవరి 22, 2019) లక్నోలో సీఎం యోగి ఇంజినీరింగ్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన యువా కీ మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి.. ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు బదులుగా.. ‘‘ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటే ఎంతో పోరాడాలి. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై విచారణ మొదలుపెట్టాం. ఉగ్రవాదులకు అంతే దీటుగా సమాధానమిస్తాం’’ అని అన్నారు. 

ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు మీ ప్రభుత్వం ఏం చేస్తోంది? అని విద్యార్థి మరో ప్రశ్న సంధించాడు. అందుకు యోగి స్పందిస్తూ.. ‘మోడీ నాయకత్వంలో దేశంలోని ఉగ్రవాదాన్నిఏరిపారేస్తామని చెప్పారు. కశ్మీర్ లో ఏం జరుగుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం పెచ్చురిల్లుతోంది. ఉగ్రవాదం అంతమయ్యే రోజులు దగ్గరపడ్డాయి. మోడీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణిచివేయాలని గట్టిగా నిర్ణయించుకుంది’ అని యోగి అన్నారు. విద్యార్థులు మరో ప్రశ్న అడిగే లోపే.. యోగి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.

వెంటనే తన హ్యాండ్ కర్చిప్ ను బయటకు తీసి.. ఒక చేతిలో మైక్ పట్టుకుని మరో చేతితో కన్నీళ్లను తుడ్చుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనతో అప్రమత్తమైన భద్రత బలగాలు 48 గంటల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టారని కన్నీటితోనే ఆయన సమాధానమిచ్చారు. సీఎం యోగి కంటతడి పెట్టిన వీడియో  ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..