UP Elections : అయోధ్య నుంచి బరిలోకి యోగి ఆదిత్యనాథ్!

  మరికొద్ది నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

UP Elections : అయోధ్య నుంచి బరిలోకి యోగి ఆదిత్యనాథ్!

Yogi (1)

UP Elections  మరికొద్ది నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అయితే యూపీలో అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా బీజేపీ సంచల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం యోగి ఆదిత్యానాథ్ శాసన మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎం యోగిని ఈసారి అయోధ్య నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.

అధిష్ఠానం పెద్దలు ఇదే విషయంపై కొన్ని రోజుల పాటు మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయోధ్య నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వేదప్రకాశ్ గుప్త సీఎం యోగి కోసం ఈ సీటును త్యాగం చేయనున్నారు. ఇందుకు ఆయన సంతోషకరంగా అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు,ఇవాళ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో పర్యటిస్తున్నారు.  రామమందిర  నిర్మాణ పనులను యోగి పరిశీలించారు.