Co-WIN, Aarogya Setu : కరోనా వ్యాక్సినేషన్ యాప్ సర్వర్ క్రాష్..

వ్యాక్సినేషన్ యాప్ బిజీ అయిపోయి..క్రాష్ అయిపోయింది. ఉదయం నుంచి ఎదురు చూస్తున్న యువతకు నిరాశే ఎదురైంది. కోవిన్ యాప్ పోర్టల్, ఉమాంగ్ యాప్, ఆరోగ్య సేతు యాప్ సర్వర్ లు అన్నీ క్రాష్ అయ్యాయి.

Co-WIN, Aarogya Setu : కరోనా వ్యాక్సినేషన్ యాప్ సర్వర్ క్రాష్..

Co-WIN, Aarogya Setu apps

Apps Crash : కరోనా వ్యాక్సినేషన్ పంపిణీని వేగవంతం చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలువురికి వ్యాక్సినేషన్ వేసిన సంగతి తెలిసిందే. 18 నుంచి 45 సంవత్సరాలు మధ్య ఉన్న వారికి టీకా రిజిస్ట్రేషన్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 2021, ఏప్రిల్ 28వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. దీంతో చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు పోటీ పడ్డారు. దీంతో వ్యాక్సినేషన్ యాప్ బిజీ అయిపోయి..క్రాష్ అయిపోయింది. ఉదయం నుంచి ఎదురు చూస్తున్న యువతకు నిరాశే ఎదురైంది. కోవిన్ యాప్ పోర్టల్, ఉమాంగ్ యాప్, ఆరోగ్య సేతు యాప్ సర్వర్ లు అన్నీ క్రాష్ అయ్యాయి.

28వ తేదీ బుధవారం సాయంత్రం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం వెంటనే వేల సంఖ్యలో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించారు. సర్వర్లు క్రాష్ అయితున్నాయని పలువురు వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. లాగిన్ అవ్వడానికి అవసరమైన వన్ టైమ్ పాస్ వర్డ్ (OTP)…కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫోన్ నెంబర్ కు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికంగా లాగిన్ కావడంతో..కోవిన్ సర్వర్లు డౌన్ అయ్యాయని, ఒకే సమయంలో భారీగా రిజిస్ట్రేషన్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు. సమస్యను త్వరగానే పరిష్కరించబోతున్నట్లు తెలిపారు.

మే 1 నుంచి మూడో విడత కరోనా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నారు. ఈ విడతలో 18 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు వేస్తారు. కొవిన్ పోర్టల్ తో పాటు ఆరోగ్య సేతు యాప్, ఉమంగ్ యాప్ ల ద్వారా ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసుకోవాలని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఒకే లాగిన్ తో నలుగురు రిజిస్టర్ చేసుకోవచ్చని, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీని నివారించేందుకే ముందస్తు రిజిస్ట్రేషన్ విధానం తీసుకువచ్చినట్టు కేంద్రం వివరించింది.

Read More : Covid Vaccine: కొవీషీల్డ్ ధరను మళ్లీ మార్చిన సీరం