పాత ప్లాస్టిక్‌తో Coca-Cola బాటిల్స్

పాత ప్లాస్టిక్‌తో Coca-Cola బాటిల్స్

అంతర్జాతీయ మార్కెట్‌లో శీతల పానీయాల కంపెనీగా దశాబ్దాల నుంచి వెలుగొందుతున్న కోకా కోలా సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్వీడన్‌లో ఉన్న బ్రాంచి నుంచి పర్యావరణహితమైన ఉత్పత్తులు వచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే కోకాకోలా డ్రింక్ బాటిళ్లను రీ సైకిల్ తో తయారుచేసేందుకు సిద్ధమైంది. 

సంవత్సరానికి 3వేల 500టన్నుల కొత్త ప్లాస్టిక్ అవసరమవుతుండటంతో కోకాకోలా కంపెనీ పాత ప్లాస్టిక్‌నే ఈ స్థానంలో వాడుకోవచ్చని యోచించింది. స్ప్రైట్ లాంటి 40రకాల ఉత్పత్తులు పంపుతున్న కోకాకోలా వచ్చే ఏడాది మొత్తం రీ సైకిల్డ్ ప్లాస్టిక్ నే వాడాలనుకుంటుంది. ఇటీవల గ్రీన్‌పీస్ వెల్లడించిన కథనం ప్రకారం.. ప్రపంచంలోనే 4లక్షల 76వేల పదార్థాలతో కాలుష్యం చేస్తున్న ఉత్పత్తిగా కోకాకోలా నిలిచింది. 

ఇటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం వల్ల 2025నాటికి 50శాతం కొత్త ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించిన వాళ్లమవుతాం. స్వీడన్ లో ఇప్పటికే 80శాతం ప్లాస్టిక్ ను రీసైకిల్ చేసేందుకు అప్పగించి క్యాష్ బాక్ పొందుతున్నారు అక్కడ ప్రజలు. కోకాకోలా బాటలోనే, పెప్సికో, నెస్లే ఎస్ఏ తమ బాటలో నడుస్తున్నాయి. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకుంటున్నాయి.