Coimbatore cylinder blast : దీపావళి వేళ ఉగ్రదాడికి స్కెచ్, ప్లాన్ ఫెయిల్ కావడంతో టెర్రరిస్ట్ మృతి

పండుగ వేళ విధ్వంసం సృష్టిద్దామనుకున్నారు. ప్లాన్ ఫెయిల్ కావడంతో వాడు కుక్క చావు చచ్చాడు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కారులోని గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Coimbatore cylinder blast : దీపావళి వేళ ఉగ్రదాడికి స్కెచ్, ప్లాన్ ఫెయిల్ కావడంతో టెర్రరిస్ట్ మృతి

Coimbatore cylinder blast : పండుగ వేళ విధ్వంసం సృష్టిద్దామనుకున్నారు. ప్లాన్ ఫెయిల్ కావడంతో వాడు కుక్క చావు చచ్చాడు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కారులోని గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కచ్చితంగా ఉగ్రవాద ప్లాన్ అని పోలీసులు అనుమానించారు. కోయంబత్తూరులోని ఉక్కడంలోని ఓ దేవాలయం సమీపంలో కారులో ఉన్న ఎల్పీజీ సిలిండర్లు పేలి ఒకరు మృతి చెందారు. మృతుడిని 25ఏళ్ల జమేషా ముబిన్ గా గుర్తించారు.

ముబిన్ కు ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2019లోనే ఎన్ఐఏ ముబిన్ ను విచారించింది. ముబిన్ ఇంట్లో పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, బొగ్గు, సల్ఫర్ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో ముబిన్ ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. ఆరు ప్రత్యేక టీమ్ లు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నాయి.

కోయంబత్తూరులో పేలుళ్లకు పథకం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీసీ ఫుటేజ్ లో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. జమేషా ముబిన్ తో సహా మొత్తం నలుగురు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ ఫుటేజ్ లో నలుగురూ కలిసి ఒక బరువైన వస్తువును ఇంటి నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు ఉన్నాయి.

సిలిండర్ లో పేలుడు పదార్థాలను నింపుకుని బయటకు తీసుకొచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. సిలిండర్ ను కారులో ఉంచి భారీ పేలుడు జరిపేలా ప్లాన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుట్రను అమలు చేసేలోపే ప్రమాదవశాత్తు పేలుడు జరిగి ముబిన్ మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో ఇప్పటికే ముబిన్ మరణించగా మిగిలిన ముగ్గురి ఆచూకీ కోసం పోలీసుల విస్తృతంగా గాలిస్తున్నారు. ఉగ్ర సంస్థ ఐసిస్ పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆదివారం సాయంత్రం తమిళనాడులో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరు ఉక్కడంలోని ఓ గుడి పక్కన పార్క్ చేసిన కారులో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో ముబిన్ మరణించాడు. తొలుత ఈ ఘటనను పోలీసులు చాలా నార్మల్ గా తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇదొక ఉగ్రవాద కుట్రకోణం అని బట్టబయలు చేశారు. ముబిన్ గురించి ఆరా తీసినప్పుడు షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ముబిన్ కు ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నట్టు గుర్తించారు.

2019లోనే ఎన్ఐఏ ముబిన్ ను విచారించింది. ఈ క్రమంలో ముబిన్ బస చేసిన ఇంట్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. నిన్న రాత్రి నుంచి ఈ సాయంత్రం వరకు సోదాలు చేశారు. ముబిన్ ఇంట్లో పొటాషియం నైట్రేట్, అల్యూమినియం, బొగ్గు, సల్ఫర్ స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా బాంబుల తయారీకి వాడే ముడి పదార్దాలు. దీంతో కోయంబత్తూరులో భారీ ఉగ్రకుట్రకు ముబిన్ ప్లాన్ చేశాడని, అయితే అది ఫెయిల్ కావడంతో అదే బాంబు పేలుడులో ముబిన్ చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ముబిన్ వెనుక ఇంకా ఎవరున్నారు? ముబిన్ కు సహకరించింది ఎవరు? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులు ముబిన్ తో పాటు ఉన్న ఇతర నేరస్తులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనతో తమిళనాడు రాష్ట్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలర్ట్ అయిన పోలీసులు కోయంబత్తూరులో భద్రతను కట్టుదిట్టం చేశారు.