షాకింగ్ : కుక్క కోసం యువతి ఆత్మహత్య

తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి కుక్క కోసం ఆత్మహత్య చేసుకుంది. కుక్కని వదిలి ఉండలేను అంటూ ఏకంగా ప్రాణాలే తీసుకుంది. యువతి చర్యతో

  • Published By: veegamteam ,Published On : November 3, 2019 / 03:06 AM IST
షాకింగ్ : కుక్క కోసం యువతి ఆత్మహత్య

తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి కుక్క కోసం ఆత్మహత్య చేసుకుంది. కుక్కని వదిలి ఉండలేను అంటూ ఏకంగా ప్రాణాలే తీసుకుంది. యువతి చర్యతో

తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి కుక్క కోసం ఆత్మహత్య చేసుకుంది. కుక్కని వదిలి ఉండలేను అంటూ ఏకంగా ప్రాణాలే తీసుకుంది. యువతి చర్యతో కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. ఎంతపని చేశావమ్మా అంటూ కన్నీరుమున్నీరు అయ్యారు.

వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల కవిత ఓ అకౌంటెంట్. తన కుక్క కైసర్‌ అంటే ఆమెకు చాలా ఇష్టం. కానీ కుటుంబ సభ్యులు… ఆ కుక్కను వదిలేయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె డిప్రెషన్ కు లోనైంది. కుక్కను విడిచి బతకలేననుకున్న కవిత… కఠిన నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకుంది. చెన్నైకి దక్షిణంగా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది. తనను క్షమించమని కుటుంబ సభ్యుల్ని కోరుతూ సూసైడ్ నోట్ రాసిన కవిత… తన కుక్కను జాగ్రత్తగా చూసుకోవాని కోరింది. ఆ లేఖ చూసిన తల్లిదండ్రులు, పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందని కుటుంబ సభ్యుల్ని అడిగితే… వాళ్లు అసలు విషయం చెప్పారు. ఆ కుక్కను వదిలేయమంటే… కవిత ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తాము అస్సలు ఊహించలేదని విలపించారు.

రెండేళ్ల కిందట కవిత చిన్న కుక్క పిల్లలను తెచ్చుకుంది. దానికి కైసర్ అని పేరు పెట్టింది. అయితే రాత్రి కాగానే ఆ కుక్క గట్టిగా అరుస్తోంది. ఆ అరుపులకు చుట్టుపక్కల వారికి నిద్ర పట్టడం లేదు. కవిత ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవపడే వాళ్లు. దాంతో ఆ కుక్కను వదిలేయాలని కవితకు కుటుంబ సభ్యులు చెప్పారు. ఇలా చాలాసార్లు జరిగింది. కుక్కను దూరంగా వదిలెయ్యమని ఈ మధ్య కవితకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు తండ్రి.

దీంతో హర్ట్ అయిన కవిత గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంత సేపటికి బయటకు రాలేదు. కంగారుపడిన తల్లిదండ్రులు తలుపులు బద్ధలు కొట్టి చూశారు. కవిత ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపించడంతో షాక్ తిన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కవిత గదిలో సూసైడ్ నోట్‌ దొరికింది. అందులో… “మమ్మీ, డాడీ, బ్రదర్… కైసర్‌ని జాగ్రత్తగా చూసుకోండి. నన్ను క్షమించండి. అందరూ హ్యాపీగా ఉండండి. వారానికోసారి టెంపుల్‌కి వెళ్లండి” అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులే కాదు స్థానికులు కూడా షాక్ తిన్నారు. అక్కడ విషాదచాయలు అలుముకున్నాయి.