కోవాగ్జిన్ తీసుకున్న మోడీ..కోవిషీల్డ్ సామర్థ్యంపై ఓవైసీ అనుమానం

కోవాగ్జిన్ తీసుకున్న మోడీ..కోవిషీల్డ్ సామర్థ్యంపై ఓవైసీ అనుమానం

Covishield’s efficacy సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ సామర్థ్యంపై అనుమానం వ్య‌క్తం చేశారు ఏఐఏఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ. ఇవాళ నుంచి దేశంలో రెండో ద‌శ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఆయ‌న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కొవిషీల్డ్ గురించి కొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ఓవైసీ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఒక్కరూ కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ లలో ఏదో ఒకదానిని తీసుకోవాలి. నాది ఒక ప్రశ్న ఏంటంటే..ఆక్స్ ఫర్డ్ తో కలిసి ఆస్ట్రాజెనికా కంపెనీ అభివృద్ధి చేసి సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్..18-64 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారికే మాత్రమే స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న‌ద‌ని, 64 ఏళ్లు దాటిన వారికి అంత స‌మ‌ర్థంగా ప‌ని చేయ‌డం లేద‌ని జ‌ర్మ‌నీ ప్ర‌భుత్వం ఓ రిపోర్ట్ లో చెప్పిన‌ట్లు ఒవైసీ తెలిపారు. ఇప్పుడు ప్ర‌ధాని మోడీ కూడా యాదృచ్ఛికంగా కొవాగ్జిన్‌ తీసుకున్నారన్నారు. ఈ నేప‌థ్యంలో కొవిషీల్డ్‌పై ఈ అనుమానాల‌ను నివృత్తి చేయాల‌ని తాను మోడీ స‌ర్కార్‌ను కోరుతున్నానని ఓవైసీ అన్నారు.

కాగా, దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన ఆరు వారాల తర్వాత సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్​కు వెళ్లి “కోవాగ్జిన్” వ్యాక్సిన్ తొలి డోసు స్వీకరించారు. అయితే, కొవాగ్జిన్ టీకాపై మొద‌ట్లో చాలా మంది అనుమానాలు వ్య‌క్తం చేశారు. మూడో దశ ప్రయోగ ఫలితాలు వెలువడక ముందే కొవాగ్జిన్​కు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యాక్సిన్‌ను ప్ర‌ధాని మోడీ తీసుకొని మిగ‌తావారికి ఆద‌ర్శంగా నిల‌వాల‌నీ అన్నారు. ఇప్పుడు 60 ఏళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సినేష‌న్ ప్రారంభించిన తొలి రోజే మోడీ..ఆ కొవాగ్జిన్ టీకా తీసుకున్నారు.

కాగా, దేశంలో అత్యవసర వినియోగానికి ఫూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ.. భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్), నేషనల్ వైరాలజీ ఇన్​స్టిట్యూట్(ఎన్ఐవీ)తో కలిసి అభివృద్ధి చేసిన “కోవాగ్జిన్” వ్యాక్సిన్ కు ఈ ఏడాది జనవరిలో డీజీసీఐ అనుమతి లభించిన విషయం తెలిసిందే. కొవిషీల్డ్ భారత్​లో తయారైనా.. విదేశీ సంస్థలు దాని అభివృద్ధిలో భాగమయ్యాయి. కానీ, కొవాగ్జిన్ పూర్తిస్థాయి స్వదేశీ టీకా. అందులోనూ భారత ప్రభుత్వానికి చెందిన సంస్థలు కొవాగ్జిన్ తయారీలో పాల్గొన్నాయి. కొవిషీల్డ్​కు బదులుగా కొవాగ్జిన్ టీకాను స్వీకరించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. బలమైన సందేశాన్ని ఇచ్చినట్లైంది. దేశంలోని అత్యున్నత పదవిలో ఉన్న నేత ఈ టీకాను స్వీకరించడం ద్వారా భారత శాస్త్రవేత్తల సామర్థ్యాలను గుర్తించడమే కాకుండా విమర్శలకు చెక్ పెట్టినట్లయింది.