Student Gang Raped : బాయ్ ఫ్రెండ్ ఎదుటే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. చంపేస్తామని బెదిరించి అఘాయిత్యం

తమిళనాడులోని కాంచీపురంలో దారుణం జరిగింది. ఓ కాలేజీ విద్యార్థినిపై ఆకతాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Student Gang Raped : తమిళనాడులోని కాంచీపురంలో దారుణం జరిగింది. ఓ కాలేజీ విద్యార్థినిపై ఆకతాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏకంగా ఆమె బాయ్ ఫ్రెండ్ ముందే ఐదుగురు ఆకతాయిలు అత్యాచారం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం రాత్రి 7 గంటలకు కాంచీపురంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ విద్యార్థిని, ఆమె స్నేహితుడు మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడకు వెళ్లిన ఐదుగురు ఆకతాయిలు వారిని చుట్టముుట్టారు.

అబ్బాయిని కత్తితో బెదిరించి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేశారు. ఒకవేళ ఒప్పుకోకుంటే చంపేస్తామని బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆకతాయిల నుంచి తప్పించుకున్న ఇద్దరూ బంధువుల ఇంటికి వెళ్లారు. బాధిత విద్యార్థినిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Gang Rape: పదో తరగతి బాలికపై అత్యాచారం.. నిందితులంతా మైనర్లే

చీకటిగా ఉండటంతో ఆ గ్యాంగ్ ను గుర్తుపట్టలేకపోయానని.. కానీ ఓ వ్యక్తి విమల్ అని పిలవడం గమనించినట్లు విద్యార్థిని పోలీసులకు వివరించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. విపాడు గ్రామంలో ఉన్న విమల్ ని అరెస్టు చేశారు. అనంతరం అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మణికందన్, శివకుమార్, విఘ్నేశ్, తెన్నారుసులను పోలీసులు పట్టుకున్నారు. ఆ అయిదుగురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు