Hardik Patel: మా పార్టీలోకి రండి.. హార్దిక్ పటేల్‌కు ఆమ్‌ఆద్మీ పిలుపు

రాబోయే కొద్ది నెలల్లో గుజరాత్ అసెంబ్లీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని పార్టీలు గుజరాత్‌పై దృష్టిసారిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో...

Hardik Patel: మా పార్టీలోకి రండి.. హార్దిక్ పటేల్‌కు ఆమ్‌ఆద్మీ పిలుపు

Hardik Patel

Hardik Patel: రాబోయే కొద్ది నెలల్లో గుజరాత్ అసెంబ్లీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని పార్టీలు గుజరాత్‌పై దృష్టిసారిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ గుజరాత్‌పై దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో గుజరాత్ యువనేత, ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించింది. ఇటీవలి కాలంలో హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారని, ఆయన త్వరలో పార్టీ మారుతున్నారన్న వార్తలు వచ్చాయి.

Gujarat : కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రక్షాళన.. టీంలోకి కొత్తగా 200 మంది

ఈ క్రమంలో గుజరాత్ ఆమ్‌ఆద్మీ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా హార్దిక్ పటేల్‌ను ఆమ్‌ఆద్మీలోకి రావాలని సూచించారు. గోపాల్ ఇటాలియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ లాంటి పార్టీలో మీలాంటి వారు ఉండకూడదని, హార్ధిక్ కాంగ్రెస్‌ను ఇష్టపడకపోతే ఆయన మా పార్టీలో చేరాలని సూచించారు. కాంగ్రెస్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం, సమయం వృథా చేయడం కంటే మా పార్టీకి సేవలందించడం ఉత్తమం అని, కాంగ్రెస్ లాంటి పార్టీలో మీలాంటి అంకిత‌భావం ఉన్న వ్యక్తులకు స్థానం ఉండదని గోపాల్ ఇటాలియా అన్నారు.

Coronavirus: ఢిల్లీ కేంద్రంగా మరో కరోనా వేవ్ తప్పదా? చాపకింద నీరులా పెరుగుతున్న పాజిటివ్ కేసులు..

మరోవైపు హార్దిక్ పటేల్ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీని వీడేదిలేదని స్పష్టం చేశారు. నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, స్థానిక నేతల మధ్య విబేధాలున్నా వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్తామని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్ధిక్ అన్నారు. నా పార్టీ మార్పుపై వస్తున్నవన్నీ ఊహాగానాలే అని హార్దిక్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధికి 100శాతం పనిచేశానని, ఇకపై‌కూడా అలాగే పనిచేస్తానని, గుజరాత్‌లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకెళ్తామని, గుజరాత్‌ను ఉత్తమంగా మార్చేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని హార్దిక్ స్పష్టం చేశారు.