ప్రియాంకా గాంధీ ‘ముక్కు’ డ్రస్ లపై బీజేపీ నేతల వ్యాఖ్యలు

  • Published By: veegamteam ,Published On : March 27, 2019 / 06:37 AM IST
ప్రియాంకా గాంధీ ‘ముక్కు’ డ్రస్ లపై బీజేపీ నేతల వ్యాఖ్యలు

ఢిల్లీ : ఎన్నికల వేళ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీపై కేంద్రమంత్రి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. యూపీ కాంగ్రెస్ ప్రచార ఇన్ చార్జ్ ప్రియాంకా గాంధీపై కేంద్ర మంత్రి మాన్ సుఖ్ మాండవీయ  నోరు జారారు. గుజరాత్ లోని ఆనంద్ లో జరిగిన ‘విజయ్ సంకల్ప్ యాత్ర’లో మాండవీయ మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ లాంటి ముక్కు ఉన్నంత మాత్రాన ప్రియాంకా గాంధీ అధికారంలోకి రాలేరని..అలా జరగుతుందని వారు భావిస్తే..చైనాలో ప్రతీ ఇంటి నుంచి ఓ అధ్యక్షుడు వస్తాడని వ్యంగ్యంగాస్త్రాలు సంధించారు.
Read Also : బదిలీలపై కోర్టుకు ఏపీ సర్కార్ : మోడీ, షా భయంకర వ్యక్తులు – బాబు

మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్నికల్లో రాజకీయాలను పక్కన పెట్టి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం..ఆమె ధరించే దుస్తులపై విమర్శలు చేయటం  సరికాదని  మండిపడుతున్నారు. అంతేకాదు..ప్రియాంకపై మరో బీజేపీ నేత హరీశ్ ద్వివేదీకూడా వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో టాప్-జీన్స్ వేసుకుని తిరిగే ప్రియాంక ఎన్నికల ప్రచారానికి రాగానే శారీ కట్టుకుని, నుదుట సింధూరం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలపై నెటిజన్లతో పాటు పలువురు మహిళలు మండిపడుతున్నారు. 
Read Also : 20రోజులు ఓపిక పడితే : మనందరి ప్రభుత్వం వస్తుంది