Yogi-Modi : కొత్త భారత్ కోసం కట్టుబడి ఉన్నాం..మోదీతో ఫొటోకి యోగి క్యాప్షన్

కొత్త భారత్ కోసం కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోలను ఆదివారం ట్విట్టర్ లో షేర్ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆ ట్వీట్ లో యోగి ఆదిత్యనాథ్

Yogi-Modi : కొత్త భారత్ కోసం కట్టుబడి ఉన్నాం..మోదీతో ఫొటోకి యోగి క్యాప్షన్

Modi Yogi

Yogi-Modi :  కొత్త భారత్ కోసం కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ ప్రధాని మోదీతో కలిసి దిగిన  ఫొటోలను ఆదివారం ట్విట్టర్ లో షేర్ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆ ట్వీట్ లో యోగి ఆదిత్యనాథ్..” మేము ఒక లక్ష్యంతో ప్రయాణాన్ని ప్రారంభించాము, దాని కోసం మమ్మల్ని అంకితం చేసుకున్నాము. మేము సన్ షైన్ కోసం, ఆకాశాన్ని దాటి కొత్త భారతదేశాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాము” అని హిందీలో పేర్కొన్నారు.

కాగా, రెండు రోజుల యూపీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇవాళ లక్నోలో 56వ డిజిపి-ఐజిపి సమావేశానికి హాజరయ్యారు. లక్నో పర్యటన సందర్భంగా ప్రధానితో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు యోగి ఆదిత్యనాథ్. ఇక,ప్రధాని రెండు రోజుల పర్యటన ఇవాళ ముగియనుంది. ఇవాళ సాయంత్రం మోదీ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

ఇక, 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 2022 ప్రారంభంలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నప్పటికీ…భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ అత్యంత ముఖ్యమైనది. ఉత్తరప్రదేశ్ గెలిచి 2024లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి రూట్ క్లియర్ చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ,ఇతర కేంద్రమంత్రులు వరుస యూపీ పర్యటనలు చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలను ఆకర్షించేందుకు యోగి సర్కార్ కూడా ప్రయత్నిస్తోంది.

ALSO READ Farmers Protests : యథావిధిగా రైతు నిరసనలు..పలు డిమాండ్లతో మోదీకి లేఖ