మీరు ఇంతవరకు వినని కరోనా సాధారణ రోగ లక్షణం ఏంటంటే..

మీరు ఇంతవరకు వినని కరోనా సాధారణ రోగ లక్షణం ఏంటంటే..

కరోనావైరస్ లో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించొచ్చు కనిపించకపోవచ్చు. కానీ, ఓ కామన్ లక్షణం మాత్రం కచ్చితంగా ఉంటుంది. కరోనా వచ్చిందనే స్పృహతో పాటు వాసన చూడలేకపోవడం. సిగరెట్ స్మెల్ కూడా చూడలేకుండా ఉంటారు.

సోషల్ మీడియాలో కరోనావైరస్ సోకిన ఓ పేషెంట్ ఇతర పేషెంట్లను అడిగాడు. ఎవరికైనా హెల్యూజినేషన్ ఫీలింగ్ అనిపించిందా.. అంటే వాసన తెలియకపోవడం వంటివి. అని క్వశ్చన్ చేస్తూ తనకు మాత్రం ఏదో కాలిపోతున్నట్లు అంటే సిగరెట్ కాలుతున్న వాసన వస్తుండేదట.

ఈ కొత్త లక్షణాన్ని ఇతర ఫేస్‌బుక్ యూజర్లు కూడా ఒప్పుకున్నారు. ఓ కామెంటేటర్ అయితే ‘అవును నేను సిగరెట్ కాలుతున్న వాసనను ఫేస్ చేశాను. ఏ కారణం లేకుండానే సిగరెట్ వాసన వస్తుండేదని ఇంకో యూజర్ కామెంట్ చేశాడు.

నా 2వారాల క్వారంటైన్ లో నాకు కిచెన్ లో ఏదో కాలుతున్నట్లుగా వాసన వచ్చేది. ఆ తర్వాతకు గానీ నాకు అర్థం కాలేదు. ఇంకొకరేమో.. ఇళ్లు మంట అంటుకుని తగులబడుతున్నాయేమో అనుకున్నా. అని ఇంకొకరు నా ఇంటి పక్కన సిగరెట్ అడ్డా ఏమైనా పెట్టారేమో అనుకున్నా అని చెప్పుకొచ్చాడు. ఇంకొకరికి కెమికల్ వాసన, కాలిన వాసన వచ్చేవట. వీటికి మరో వ్యక్తి సొల్యూషన్ కూడా చెప్పాడు. ముక్కుల్లో డ్రాప్ లు వేసుకోవడం.. లేదా సెలైన్ వాసన చూడటం మంచిది.

వీటిపై వైద్యులు కూడా స్పందిస్తున్నారు. జలుబు కారణంగా ముక్కులు మూసుకుపోయి వాసన పీల్చుకోలేకపోవడం కాదు. వైరస్ అనేది వాసన పీల్చుకునే నరాలను ఆల్రెడీ బ్లాక్ చేసి ఉంచుతుంది. కొందరిలో వైరస్ నుంచి కోలుకోగానే ఆ సమస్య క్లియర్ అవ్వొచ్చు. మరికొందరిలో సమస్య తగ్గని సందర్భాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఇలా వాసన పూర్తిగా తెలియకపోవడాన్ని పారోస్మియా అని సగం వాసన తెలియడాన్ని అనోస్మియా అంటారు. వాసన లేదా రుచి సుదీర్ఘ కాలంగా తెలియకుండాపోతే దానిని ఫాంటోస్మియా అంటారని చెబుతున్నారు డాక్టర్లు.