Delhi : మత విధ్వేషం వ్యాప్తిపై ట్విట్టర్ ఎండీపై ఫిర్యాదు

ట్విట్టర్‌‌కు పలు చిక్కులు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా..ట్విట్టర్ ఇండియా..హిందువుల మత మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సంస్థపై ఢిల్లీలో ఫిర్యాదులు అందాయి.

Delhi : మత విధ్వేషం వ్యాప్తిపై ట్విట్టర్ ఎండీపై ఫిర్యాదు

Twitter

Twitter India : ట్విట్టర్‌‌కు పలు చిక్కులు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా..ట్విట్టర్ ఇండియా..హిందువుల మత మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సంస్థపై ఢిల్లీలో ఫిర్యాదులు అందాయి. హిందూ దేవతను అవమానించారనే ఆరోపణలపై న్యాయవాది ఆదిత్య సింధ్ దేశ్వాల్, ట్విట్టర్ ఎండీ మనీష్ మహేశ్వరి, నాస్తిక్ రిపబ్లిక్ (NGO) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఎథిస్ట్ రిపబ్లిక్ అనే ఎన్జీవో కాళీమాతపై అభ్యంతకరమైన చిత్రాన్ని పోస్టు చేసిందని, ఈ విషయంలో ట్విట్టర్ ఇండియా తరపున ఉద్దేశ్యపూర్వకంగా…ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. సమాజంలో శత్రుత్వం, దుష్టసంకల్పం కూడా సృష్టిస్తుందని ఎఫ్ఐఆర్ లో వెల్లడించింది. అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాస్తిక్ రిపబ్లిక్ హిందూమతం, ఇతర మతాల గురించి..అభ్యంతరాలతో కూడిన విషయాలు ఉన్నాయని, అయినా..కంటెంట్ ను తొలగించడానికి ట్విట్టర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని..భారతదేశం చట్టాలను ఉల్లంఘిస్తోందని ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు.

ధ్వేషపూరిత కంటెంట్ ను తొలగించకుండా..ఐపీసీలోని అనేక విభాగాలను ఉల్లంఘిస్తోందని వెల్లడించారు. ట్విట్టర్ ఇండియా సామాజిక బాధ్యతగా ఇలాంటి వివాదాస్పద పోస్టులను తొలగించేందుకు ప్రయత్నించడం లేదని న్యాయవాది ఆదిత్యా సింగ్ వెల్లడించారు. భారత చట్టాలను ఉల్లంఘిస్తున్న ట్విట్టర్ పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు