Mumbai Lock Down : పూర్తి స్థాయి లాక్ డౌన్ దిశగా ముంబై ?

దేశంలో మిగిలిన రాష్ట్రాల కరోనా కేసులు ఒక ఎత్తైతే.. మహారాష్ట్రది మరో ఎత్తు. 15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్‌ అమలు చేస్తున్నా కానీ మహారాష్ట్రలో కేసులు తగ్గకపోడంతో పూర్తి స్థాయి లాక్‌డౌన్ వైపు మహా సర్కార్‌ ఆలోచిస్తుంది.

Mumbai Lock Down : పూర్తి స్థాయి లాక్ డౌన్ దిశగా ముంబై ?

Mumbai Lock Down

Complete lock down should be imposed in Mumbai :  కరోనా కట్టడి కోసం ఆంక్షలు పెట్టినా సరిపోవడంలేదు. సెమీ లాక్‌డౌన్‌ విధించినా ఉపయోగంలేదు. దేశంలో మిగిలిన రాష్ట్రాల కరోనా కేసులు ఒక ఎత్తైతే.. మహారాష్ట్రది మరో ఎత్తు. 15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్‌ అమలు చేస్తున్నా కానీ మహారాష్ట్రలో కేసులు తగ్గకపోడంతో పూర్తి స్థాయి లాక్‌డౌన్ వైపు మహా సర్కార్‌ ఆలోచిస్తుంది.

ఒక అత్యవసర సేవల మినహా అన్నిటిపైన ఆంక్షలు పెట్టాలని భావిస్తోంది. ముంబై అధికారులు ఇప్పటికే ఈ విధంగా ప్లాన్ రెడీ చేశారు. అటు ఔరంగాబాద్‌, సోలాపూర్‌లో వచ్చే 14 రోజుల పాటు కఠిన ఆంక్షలు అమలు చేయాలని అక్కడి అధికార యంత్రంగం డిసైండ్‌ అయింది.

ఇప్పటికే ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసే ఉండగా.. పెట్రోల్‌ బంకులను కూడా ఈ లిస్ట్‌లో పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. కేవలం రోజుకు 4గంటల పాటు మాత్రమే వాటికి అనుమతివ్వలని నిర్ణయించుకున్నారు.

ఔరంగాబాద్‌, సోలాపూర్, ముంబైతో పాటు రత్నగిరిలోనూ ఈ తరహా ఆంక్షలు పెట్టనున్నారు అధికారులు. ఇప్పటికే ఈ నాలుగు ప్రాంతాల్లోని చాలా చోట్లు అనధికారికంగా ఈ ఆంక్షలు అమలవుతున్నాయి.

ఒక విధంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ లాగానే అక్కడి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకే ఆంక్షల నుంచి మినహాయింపు ఉన్న షాపులకు అనుమతిస్తున్నారు.

బ్రేక్‌ ది చైన్‌ పేరులో ఇప్పటికే మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. అయితే కరోనా కేసుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడంలేదు. కొన్ని రోజులుగా విపరీతంగా కేసులు నమోదు అవుతున్న తీరు యావత్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ప్రభుత్వం ఎన్ని రకాలుగా కట్టడి చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా విలయతాండవం కొనసాగుతోంది.

భారీ సంఖ్యలో ఆసుపత్రులు ఉన్నప్పటికీ, వైద్యుల కొరతతో పాటు మందుల కొరత ఎక్కువగా ఉంది. దీంతో సెమీలాక్‌డౌన్‌ కాదు.. సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలకు స్థానిక అధికార యంత్రాంగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విధంగా కొత్త ఆంక్షలు పెడుతున్నాయి.