Complete Lockdown : ఆ రెండు రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి..

కరోనాను కంట్రోల్ చేసేందుకు రెండు దక్షిణాది రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్‌ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. కర్ణాటక, తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది.

Complete Lockdown : ఆ రెండు రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి..

Complete Lockdown In Karnataka And Tamilnadu

Complete Lockdown in Karnataka and Tamilnadu : కరోనాను కంట్రోల్ చేసేందుకు రెండు దక్షిణాది రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్‌ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. కర్ణాటక, తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. కర్ణాటకలో సోమవారం (మే 10) ఉదయం 6 గంటలకు ప్రారంభమైన లాక్‌డౌన్ మే 24 ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. సెమీ లాక్‌డౌన్‌ తరహాలో కాకుండా ఇవాళ్టి నుంచి కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. 10రోజులుగా విధించిన జనతా కర్ఫ్యూతో కరోనా కట్టడి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఇక లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల రాకపోకలపై పూర్తిస్థాయిలో నిషేధాజ్ఞలు ఉంటాయని, అత్యవసర సర్వీసులు మినహా మరేమీ అనుతించమని తేల్చిచెప్పారు కర్నాటక సీఎం.

ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు ఇచ్చారు. ఆ సమయంలో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అన్ని హోటళ్లు, పబ్‌లు, బార్లు మూసివేశారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు. ఇక కర్నాటకలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 47 వేల 930 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 490 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు యాక్టివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం కర్ణాటకలో 5 లక్షల 64 వేల 485 యాక్టివ్‌ కేసులున్నాయి.

తమిళనాడులోనూ లాక్ డౌన్ :
తమిళనాడులో సోమవారం (మే 10) తెల్లవారుజామున 4 నుంచి కంప్లీట్ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. ఈ నెల 24 తెల్లవారుజామున 4 గంటల వరకు ఇది కొనసాగనుంది. విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి విమానం, రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులతో సహా అందరికీ ఈ-రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసింది తమిళ సర్కార్‌. రాత్రి వేళల్లో ప్రయాణికులు తమ టిక్కెట్లు చూపించి విమానాశ్రయానికి వెళ్లవచ్చని తెలిపింది. మూడు వేల చదరపు అడుగులకు పైగా ఉన్న దుకాణాలు, వాణిజ్య కాంప్లెక్స్‌, మాల్స్‌ పనిచేసేందుకు గత నెల 26 నుంచి నిషేధం విధించారు.

విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి విమానం, రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులతో సహా అందరికీ ఈ-రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసింది తమిళ సర్కార్‌. రాత్రి వేళల్లో ప్రయాణికులు తమ టిక్కెట్లు చూపించి విమానాశ్రయానికి వెళ్లవచ్చని తెలిపింది. మూడు వేల చదరపు అడుగులకు పైగా ఉన్న దుకాణాలు, వాణిజ్య కాంప్లెక్స్‌, మాల్స్‌ పనిచేసేందుకు గత నెల 26 నుంచి నిషేధం విధించారు. ఈ కాంప్లెక్స్‌లలో ఉండే కూరగాయలు షాపులు, ఇతర దుకాణాలపై కూడా నిషేధం విధించారు. ఇవి మినహా పండ్లు, కూరగాయల, మాంసం, చేపల విక్రయ దుకాణాలు మాత్రం ఏసీ వసతి లేకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేసేందుకు అనుమతించారు.

హోటల్స్‌, రెస్టారెంట్‌లలో పార్శిల్‌ సేవలకు మాత్రమే అనుమతి ఉంది. టీ దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకే పనిచేస్తాయి. ఆడిటోరియం, మైదానాలు, కమ్యూనిటీ హాళ్లలో రాజకీయపార్టీల సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్య లాంటి కార్యక్రమాలపై నిషేధం విధించింది స్టాలిన్ సర్కార్‌. సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, యోగా శిక్షణా కేంద్రాలు, రిక్రియేషన్‌ క్లబ్‌లు, అన్ని రకాల బార్లు మూసివేయాని తెలిపింది.