Kerala : కరోనా వర్రీ, కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్

దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి అదుపులోకి వచ్చినా.. కేరళలో మాత్రం కంట్రోల్‌ కావట్లేదు. బుధవారం ఒక్కరోజే 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గినా.. కేరళలో ఇంకా 10 శాతానికిపైగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

Kerala : కరోనా వర్రీ, కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్

Kerala Lock

Weekend Lockdown : కేరళ రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎలాంటి పరిస్థితి ఉందో..ఇప్పుడు అదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. జూలై 31వ తేదీ, ఆగస్టు 01వ తేదీల్లో సంపూర్ణంగా లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల పెరుగుదలతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కాస్త కంట్రోల్‌కి వచ్చినా.. కేరళను మాత్రం వదలనంటోంది.

Read More : Old Women Dance : బామ్మ డ్యాన్స్ కు…2కోట్ల వ్యూస్

నిత్యం పది వేలకు పైగా కేసులు : –
మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల్లో కొవిడ్‌ కేసులు నమోదవుతుంటే.. కేరళలో మాత్రం నిత్యం 10 వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. దీంతో కేరళలో కొవిడ్‌ పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో కరోనా వెలుగు చూసిన తొలిరోజుల్లో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేరళ ఉత్తమ పనితీరు కనబరిచింది. కానీ.. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి.

Read More : Two Vaginas-Uteruses : ఈ యువతికి రెండు జననాంగాలు.. రెండు గర్భాశయాలు.. పైగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది!

బుధవారం 20 వేలకు పైగా కేసులు : –
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి అదుపులోకి వచ్చినా.. కేరళలో మాత్రం కంట్రోల్‌ కావట్లేదు. బుధవారం ఒక్కరోజే 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గినా.. కేరళలో ఇంకా 10 శాతానికిపైగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో సగం ఒక్క కేరళలోనే ఉంటున్నాయి.

Read More :Gold Rate : స్వల్పంగా పెరిగిన బంగారం.. భారీగా తగ్గిన వెండి ధరలు

10 నుంచి 12 శాతం పాజిటివిటీ రేటు :-
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతానికన్నా తక్కువగా నమోదవుతున్నా.. కేరళలో మాత్రం గడిచిన ఆరు వారాలుగా 10 నుంచి 12 శాతం రికార్డవుతోంది. నిత్యం 10 నుంచి 15 వేల మందిలో వైరస్‌ బయటపడుతోంది. అయితే, ఆస్పత్రిలో చేరికలు మాత్రం కాస్త తగ్గాయంటున్నారు కేరళ డాక్టర్లు. రాష్ట్రంలో భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండడంతోనే పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని అభిప్రాయపడ్డారు.