Twitter: మా ఉద్యోగుల భద్రత గురించి భయంగా ఉంది – ట్విట్టర్

కొత్త ఐటీ నిబంధనలపై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎట్టకేలకు మౌనం వీడింది. ఇటీవలి కాలంలో కేంద్రంతో విబేధాలు ఎదుర్కొంటున్న ట్విట్టర్ కొత్త రూల్స్ ను పాటించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది.

Twitter: మా ఉద్యోగుల భద్రత గురించి భయంగా ఉంది – ట్విట్టర్

Twitter

Twitter: కొత్త ఐటీ నిబంధనలపై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎట్టకేలకు మౌనం వీడింది. ఇటీవలి కాలంలో కేంద్రంతో విబేధాలు ఎదుర్కొంటున్న ట్విట్టర్ కొత్త రూల్స్ ను పాటించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది. కాకపోతే కొత్త విధానాలతో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.

‘ఇండియన్లకు సేవలందించడంలో ట్విటర్‌ కమిటెడ్‌గా ఉంటుంది. పబ్లిక్ చర్చల్లో మా సర్వీసు కీలక పాత్ర పోషిస్తుందని, మహమ్మారి సమయంలో మా మాధ్యమం ప్రజలకు అండగా ఉందని రుజువైంది. అలాంటి సేవలను అందుబాటులో ఉంచడం కోసం కొత్త చట్టాలను పాటించేందుకు ప్రయత్నిస్తాం.

‘ప్రపంచమంతా వ్యవహరిస్తున్న తీరునే అవలంభిస్తాం. పారదర్శకత సూత్రాలను కచ్చితంగా కొనసాగిస్తాం. ఈ సేవల ద్వారా ప్రతి ఒక్కరి గళాన్ని వినిపించేందుకు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడేందుకు కట్టుబడి ఉంటాం’ అని ట్విటర్‌ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

‘కొంతకాలంగా భారత్‌లో మా ఉద్యోగులకు హాని కలిగేలా సందర్భాలు వచ్చాయి. మేమెప్పుడూ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజల తరపునే ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా పాటించాల్సిన నియమాలనే అనుసరిస్తున్నాం. కొత్త ఐటీ రూల్స్ కారణంగా.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు కలిగిస్తాయనే మా ఆందోళన’

‘భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజాప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికైన అధికారులకు ఉంటుంది’ అని ట్విటర్‌ పేర్కొంది.

ఇటీవల ‘కాంగ్రెస్‌ టూల్‌కిట్‌’ వ్యవహారంలో ట్విట్టర్‌, కేంద్రం మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కాంగ్రెస్‌ టూల్‌కిట్‌ అంటూ భాజపా నేతలు చేసిన పోస్ట్‌లకు ట్విటర్‌ ‘మానిప్యులేట్ మీడియా’ అనే ట్యాగ్‌కు జత చేయడం వివాదానికి కారణమైంది. దీనిపై ఆగ్రహించింది కేంద్రం. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఢిల్లీ, గురగావ్ లో ఉన్న ట్విటర్‌ ఇండియా కార్యాలయాలకు వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు పోలీసులు.