Condom Ad: మెట్రోలో రచ్ఛలేపిన కండోమ్ యాడ్

బహిరంగంగా ముచ్ఛటించకపోయినా సెక్స్, సెక్సువాలిటీ గురించి ఏదైనా కాస్త అభ్యంతరం కనిపిస్తే చాలు. అలా ప్రచారం జరిగిపోతూనే ఉంటుంది. రీసెంట్ గా ఢిల్లీ మెట్రో ట్రైన్ లో అదే జరిగింది. అనుకున్న దానికంటే ఎక్కువ ప్రచారమే జరిగిన ఆ యాడ్ ను తొలగించామని ఢిల్లీ మెట్రో అథారిటీ వెల్లడించింది కూడా.

Condom Ad: మెట్రోలో రచ్ఛలేపిన కండోమ్ యాడ్

Condom Ad: బహిరంగంగా ముచ్ఛటించకపోయినా సెక్స్, సెక్సువాలిటీ గురించి ఏదైనా కాస్త అభ్యంతరం కనిపిస్తే చాలు. అలా ప్రచారం జరిగిపోతూనే ఉంటుంది. రీసెంట్ గా ఢిల్లీ మెట్రో ట్రైన్ లో అదే జరిగింది. అనుకున్న దానికంటే ఎక్కువ ప్రచారమే జరిగిన ఆ యాడ్ ను తొలగించామని ఢిల్లీ మెట్రో అథారిటీ వెల్లడించింది కూడా.

ఒక కండోమ్ యాడ్ ప్రయాణికులను తెగ ఇబ్బంది పెట్టేసిందట. అసలు సమస్య ఆ యాడ్‌లో అది ఉంచిన స్థానంలో..

మహిళల కోసం కేటాయించే సీట్లకు పైన ప్యానెల్ మీద.. కండోమ్ యాడ్ ప్రత్యక్షమంది. దీనిపై కొందరు అసహనం వ్యక్తం చేయగా, మరి కొందరు గుర్రుమంటున్నారు.

Read Also : కండోమ్ యాడ్‌ని ప్రమోట్ చేసిన హీరోయిన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. DMRC వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ పోస్టు పెట్టడం మొదలైంది. మరో యూజర్ ఓహ్ ఢిల్లీ మెట్రో.. మీరు చాలా ఎదిగిపోయారనుకుంటా? మహిళల సీటు మీద కండోమ్ యాడ్..? ఇది మీ తప్పు కాదు.. పగటి సమయంలో కండోమ్ యాడ్‌లు చూపించకూడదని ఈ దేశంలో లేనంతవరకూ ఇంతే..” అంటూ కామెంట్ చేశాడు.

మరికొందరికి ఇందులో తప్పేం కనిపించలేదని పోస్టు చేస్తుంటే.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నెటిజన్ల ధాటికి యాడ్ చాలా పాతదని ఆల్రెడీ తొలగించామంటూ రెస్పాన్స్ ఇచ్చింది.