Madhya Pradesh : 300ల మంది వధువులకు కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు ఇచ్చిన ప్రభుత్వం

ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల్లో వధువులకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతుల్లో ఏమున్నాయో చూసి నవ దంపతులు షాక్ అయ్యారు. శుభమాని పెళ్లి చేసుకుంటే ఇలాంటివి ఇస్తారా? అంటూ ఆశ్చర్యపోయారు.

Madhya Pradesh : 300ల మంది వధువులకు కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు ఇచ్చిన  ప్రభుత్వం

Madhya Pradesh Govt Mass weddings

Madhya Pradesh Govt Mass weddings : మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల్లో వధువులకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఇచ్చిన బహుమతుల్లో ఏమున్నాయో చూసి షాక్ అయ్యారు. సోమవారం (మే 29,2023) ఝబువా జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘సీఎం కన్య వివాహ్/నిఖా యోజన’ కింద 296 సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 296 మంది వధువులకు ప్రభుత్వం మేకప్ కిట్లు అందించింది. ఆ కిట్లలో మేకప్ సరంజామాతో పాటు కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు ఉండటం చూసి షాక్ అయ్యారు వధువులు. శుభమాని పెళ్లి చేసుకుంటే దీర్ఘ సుమంగళీ భవ అని సంతానపాప్తిరస్తు అని దీవిస్తారు. కానీ ఇదేంటీ కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు ఉన్నాయంటూ నవదంపతులు ఆశ్చర్యపోయారు.

సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతులకు వివాహాలు చేయటం కోసం ‘సీఎం కన్య వివాహ్/నిఖా యోజన’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టి దాన్ని సామూహిక వివాహాల ద్వారా అమలు చేస్తోంది. దీంట్లో భాగంగా సోమవారం ఝబువా జిల్లాలో 296 జంటలకు సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం కింద నవ దంపతులకు పంపిన మేకప్ కిట్లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఉండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

‘Audi Chaiwala’ : ఆడి కారులో వచ్చి వేడి వేడి టీ, కాఫీలు అమ్ముతున్న కుర్రాళ్లు

ఈ విమర్శలపై జిల్లా సీనియర్ అధికారి భూర్సింగ్ రావత్ మాట్లాడుతు శుభకార్యాల్లో జరిగిన పొరపాటును ఆరోగ్య శాఖపై నెట్టేశారు. కుటుంబ నియంత్రణకు సంబంధించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అధికారులు కండోమ్‌లు, గర్భనిరోధక సాధనాలను పంపిణీ చేసి ఉంటారని సర్ధిచెప్పుకొచ్చారు. కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలను పంపిణీ చేసే బాధ్యత మాది కాదు. కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖకు సంబంధించినది అని చెప్పి చేతులు దులుపుకున్నారు.

ముఖ్యమంత్రి కన్యా వివాహ్/నిఖా యోజన కింద..మేము నేరుగా రూ.49,000ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తాం. ఆహారం, నీరు, టెంట్ అందించే బాధ్యత మాది. దీని విలువ రూ.6,000. పంపిణీ చేసిన ప్యాకెట్లలో ఏముందో నాకు తెలియదు అని తెలిపారు.కాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఏప్రిల్ 2006లో ముఖ్యమంత్రి కన్యా వివాహ్/నిఖా యోజనను ప్రారంభించింది. పథకం కింద ప్రభుత్వం వధువు కుటుంబానికి రూ.55,000 అందజేస్తుంది.

కాగా గత నెలలో దిండోరిలోని గడ్సరాయ్ ప్రాంతంలో జరిగిన సామూహిక వివాహాల కార్యక్రమంలో కొంతమంది వధువులకు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ దీంట్లో ఓ మహిళలకు పాజిటివ్ రావటం గమనించాల్సిన విషయం. దీనిపై సదరు యువతి మాట్లాడుతు..పెళ్లికి ముందు నుంచే తన కాబోయే భర్తతో కలిసి జీవిస్తున్నాని తెలిపింది. వధూవరుల వయస్సును నిర్ధారించడానికి, సికిల్ సెల్ అనీమియాను తనిఖీ చేయడానికి, వారు శారీరకంగా దృఢంగా ఉన్నారని తెలుసుకునేందుకు సాధారణంగా పరీక్షలు నిర్వహిస్తారని డిండోరి చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు.

China : అక్కడి మహిళల పొడవైన జుట్టు రహస్యం ఏంటంటే?