వీవీ ప్యాట్స్ లెక్కింపు : పొలిటికల్ పార్టీల్లో కొత్త ఆందోళన

వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు కొంత ఊరట చెందాయి. అయితే పొలిటికల్ పార్టీల్లో ఇప్పుడు మరో కొత్త ఆందోళన మొదలైంది.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 03:50 AM IST
వీవీ ప్యాట్స్ లెక్కింపు : పొలిటికల్ పార్టీల్లో కొత్త ఆందోళన

వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు కొంత ఊరట చెందాయి. అయితే పొలిటికల్ పార్టీల్లో ఇప్పుడు మరో కొత్త ఆందోళన మొదలైంది.

వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు కొంత ఊరట చెందాయి. అయితే పొలిటికల్ పార్టీల్లో ఇప్పుడు మరో కొత్త ఆందోళన మొదలైంది. తమ అనుమానాలు నివృత్తి చేయమంటూ ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించినా అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో మరింత గందరగోళం నెలకొంది.

వీవీ ప్యాట్స్ లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు గందరగోళానికి దారి తీస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కించాలని కోర్టు చెప్పడం బాగానే ఉంది. ఐతే లెక్కల్లో తేడా వస్తే? ఏం చేయాలన్న ప్రశ్నకి స్పష్టత లేదు. ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కల్లో తేడా రానంతవరకూ ఏ గొడవా లేదు..కానీ తేడా వచ్చినప్పుడు  సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నది అన్ని రాజకీయ పార్టీలలో నెలకొన్న సందేహం. ఇదే విషయాన్ని కొంతమంది ఈసీ దృష్టికి తీసికెళ్లినా..అధికారులు కూడా చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. 
Read Also : కమల్‌కు మద్దతివ్వడం లేదు – రజనీకాంత్

ఈవీఎంలలో ఓట్లు, వీవీ ప్యాట్ల స్లిప్పుల్లో తేడా వస్తే అవి న్యాయపరమైన ఇబ్బందులకు దారితీసే అవకాశం కన్పిస్తోంది. అందుకే  ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ వీలైనంత తొందరగా మార్గదర్శకాలు రూపొందించాలి..ఆ తర్వాత వాటిపై పార్టీల అభిప్రాయం కూడా తీసుకోవాల్సిందే. ఎందుకంటే..ఒక్కసారి ఫలితం వెలువడిన తర్వాత ఏ పార్టీ వైఖరి ఎలా ఉంటుందో ఇప్పుడే  చెప్పడం సాధ్యమయ్యే పని కాదు.. పోలైన ఓట్లు, స్లిప్పుల లెక్కింపులో తేడాలపై పార్టీలు తిరిగి కోర్టుకి వెళ్లే అవకాశం ఉంటుంది.  స్లిప్పుల లెక్కింపునకు ఏ కేంద్రాన్ని ఎంపిక చేయాలన్న విషయంలో ఈసీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ  చేసింది. నియోజకవర్గం పరిధిలోని అన్నిపోలింగ్ కేంద్రాల పేర్లను చీటీలపై రాసి డ్రా ద్వారా 5 కేంద్రాలను ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియంతా రిటర్నింగ్ అధికారి, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. చివరి రౌండ్ పూర్తైన తర్వాత వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కింపు మొదలుపెట్టాలని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. 

పోలింగ్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం అధికారులు రౌండ్లవారీగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారన్నది చివరి రౌండ్ కన్నా ముందే తెలిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చివరలో వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కింపు ప్రారంభమవుతుంది..ఇక్కడే తేడా వస్తే..మళ్లీ అభ్యర్ధుల మధ్య గొడవ ప్రారంభం అవడం ఖాయం.  ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై స్పష్టతనిచ్చేలా మార్గదర్శకాలు జారీ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. 
Read Also : కంపెనీలు, ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం