Congress Charge Sheet: బీజేపీ మీద “ఛార్జ్ షీట్” విడుదల చేసిన కాంగ్రెస్

రాహుల్ గాంధీ సందేశంతో కూడిన లేఖను, ఛార్జ్ షీట్‭ను ప్రజల్లోకి పార్టీ తీసుకెళ్తుందని జైరాం రమేష్ అన్నారు. భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని లాల్ చౌక్ ప్రాంతంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేస్తారని, ఆ తర్వాత షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుందని ప్రతిపక్ష పార్టీ పేర్కొంది. కన్యాకుమారి టు కాశ్మీర్ మార్చ్ ముగింపు.

Congress Charge Sheet: బీజేపీ మీద “ఛార్జ్ షీట్” విడుదల చేసిన కాంగ్రెస్

Cong releases ‘charge sheet’ against Modi govt, calls BJP ‘Bhrasht Jumla Party’

Congress Charge Sheet: నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ “ఛార్జ్ షీట్” విడుదల చేసింది. అందులో బీజేపీ అబ్రివేషన్ మార్చి ‘భ్రష్ట్ జుమ్లా పార్టీ’ అని పేరుతో ఈ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. అంతే కాకుండా ‘సబ్ కా సాథ్, సాబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే నినాదాన్ని కూడా మార్చివేసి ‘కుచ్ కా సాథ్, ఖుద్ కా వికాస్, సబ్కే సాథ్ విశ్వాస్‌ఘాట్’ (కొంతమంది ప్రయోజనాల కోసం, సొంత అభివృద్ధి కోసం, అందరి ద్రోహం కోసం) అనే విధంగా మార్చివేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో చాలా కాలంగా బీజేపీని ఎదుర్కోవడానికి అవస్థలు పడ్డ కాంగ్రెస్ నేతలు, తాజాగా రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగానే శనివారం ఈ ఛార్జ్ షీట్ విడుదల చేశారు.

ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఛార్జ్ షీట్‭తో పాటు భారత్ జోడో యాత్రకు కొనసాగింపు యాత్రకు సంబంధించి ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ లోగోను ఆవిష్కరించారు. ఆ లోగో అచ్చం భారత్ జోడో యాత్ర లాగానే ఉంది. కానీ అందులో కాంగ్రెస్ హస్తం గుర్తు ఒక్కటే లేదు. అనంతరం జైరాం రమేశ్ మాట్లాడుతూ ఇది 100 శాతం రాజకీయ ప్రచారమని అన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా ఈ ప్రచారం కొనసాగిస్తామని తెలిపారు.

Siddaramaiah: మోదీ, షా వచ్చినా నన్ను ఆపలేరు.. మాజీ సీఎం సిద్ధరామయ్య ఛాలెంజ్

జనవరి 26 నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఛార్జ్ షీట్ సందేశాన్ని దేశ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సిద్ధమైనట్లు కాంగ్రెస్ పేర్కొంది. రాహుల్ గాంధీ సందేశంతో కూడిన లేఖను, ఛార్జ్ షీట్‭ను ప్రజల్లోకి పార్టీ తీసుకెళ్తుందని జైరాం రమేష్ అన్నారు. భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని లాల్ చౌక్ ప్రాంతంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేస్తారని, ఆ తర్వాత షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుందని ప్రతిపక్ష పార్టీ పేర్కొంది. కన్యాకుమారి టు కాశ్మీర్ మార్చ్ ముగింపు.

Assam CM on Pathaan: షారూఖ్ ఖాన్ ఎవరో కూడా తెలియదట.. పఠాన్ సినిమా వివాదంపై అస్సాం సీఎం కామెంట్స్

ఇక ‘ఛార్జ్ షీట్’లోని ‘కుచ్ కా సాథ్’ (కొంతమంది ప్రయోజనాల కోసం) సెగ్మెంట్ కింద, కొంతమంది ఎంపిక చేసిన వ్యాపారవేత్తలకు రుణమాఫీ చేశారని, 10 శాతం మంది సంపన్నులు భారతదేశ సంపదలో 64 శాతం ఇచ్చేశారని ఓడరేవులు, విమానాశ్రయాలను విచ్చలవిడిగా కట్టబెట్టారని ఆరోపించారు. ప్రధాన మంత్రి సన్నిహిత మిత్రులకు బహుమతి ఇచ్చే కార్యక్రమం ఇదని అన్నారు.

BBC Documentary: మోదీపై బీబీసీ డాక్యూమెంటరీ లింక్‭ షేర్ చేస్తే బ్లాక్.. సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం ఆదేశాలు

‘ఖుద్ కా వికాస్’ (సొంత అభివృద్ధి కోసం) సెగ్మెంట్‌లో, బిజెపి ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేసి, బంధుప్రీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. మూడవ విభాగంలో పార్టీ నిరుద్యోగం, ఆహార భద్రత, మహిళల భద్రత, రైతుల దుస్థితి, ద్వేషపూరిత ప్రసంగాలు, ఎన్నికైన ప్రభుత్వాల పతనంతో పాటు వివిధ రంగాలలో అంతర్జాతీయ సూచీలలో భారతదేశం ర్యాంక్ వంటి బహుళ సమస్యలను లేవనెత్తింది.