Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భద్రతపై రాజీపడం: కాంగ్రెస్

రాహుల్ భద్రతపై తాము రాజీ పడబోమని జైరాం రమేశ్ చెప్పారు. ఉగ్రవాదంపై తమకు స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు. దానిపై ఎటువంటి రాజీపడబోమని తెలిపారు. రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర అనుకున్న షెడ్యూల్ కే ముగుస్తుందని జమ్మూకశ్మీర్ ఏఐసీసీ ఇన్‌చార్జ్ రజనీ పాటిల్, ఆ ప్రాంత కాంగ్రెస్ చీఫ్ వికర్ రసూల్ వనీ, ఆ పార్టీ ప్రతినిధి రవీందర్ శర్మ చెప్పారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భద్రతపై రాజీపడం: కాంగ్రెస్

Jairam Ramesh

Bharat Jodo Yatra: జమ్మూకశ్మీర్ లో నిన్న రెండు బాంబు దాడులు జరగడం, మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుండడంతో ఆయన భద్రత అంశం చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ, బనిహాల్ లోనే రాహుల్ గాంధీ గణతంత్ర దినోవ్సతంలో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రాహుల్ భద్రతపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు.

ఆయన భద్రతపై తాము రాజీ పడబోమని చెప్పారు. ఉగ్రవాదంపై తమకు స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు. దానిపై ఎటువంటి రాజీపడబోమని తెలిపారు. రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర అనుకున్న షెడ్యూల్ కే ముగుస్తుందని జమ్మూకశ్మీర్ ఏఐసీసీ ఇన్‌చార్జ్ రజనీ పాటిల్, ఆ ప్రాంత కాంగ్రెస్ చీఫ్ వికర్ రసూల్ వనీ, ఆ పార్టీ ప్రతినిధి రవీందర్ శర్మ చెప్పారు.

‘‘మేము మా నాయకుడి భద్రత గురించి ఆందోళన చెందుతున్నాం. రెండు బాంబు దాడులు జరిగాయి. భద్రతా పరచర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి’’ అని చెప్పారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగానే ఉన్నారని తాము భావిస్తున్నామని తెలిపారు. అయితే, ఉగ్రవాదాన్ని అంతమొందించామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని, మరోవైపు బాంబు దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని స్పష్టమవుతోందని అన్నారు.

Singer Manglis Car Attacked : సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి, బళ్లారి ఉత్సవ్‌లో పాల్గొని వెళ్తుండగా ఘటన.. కారణం అదేనా?