Padma Shri: కంగనా పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్

కంగనా రనౌత్‌.. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రాలేదని, భిక్ష వేశారని, మోదీ వచ్చాకే 2014లో నిజమైన స్వాతంత్య్రం వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది

Padma Shri: కంగనా పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్

Kangana

Padma Shri: కంగనా రనౌత్‌.. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రాలేదని, భిక్ష వేశారని, మోదీ అధికారంలోకి వచ్చాకే 2014లో నిజమైన స్వాతంత్య్రం వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కంగనా రనౌత్ ప్రకటన మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి స్వాతంత్య్ర సమరయోధులకే కాదు, సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవకారుల త్యాగాలను అవమానించడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ట్వీట్ చేశారు.

కంగనా రనౌత్ అభిప్రాయానికి సపోర్ట్ చేస్తారో? లేదో? ప్రధాని తన మౌనాన్ని వీడి దేశానికి చెప్పాలి. లేని పక్షంలో అటువంటి వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్. రాష్ట్రపతి వెంటనే కంగనాకు ఇచ్చిన పద్మశ్రీ గౌరవాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్. పద్మశ్రీ లాంటి గౌరవ పురస్కారం అందుకుని దేశాన్ని, దేశ వీరులను అవమానించేవారికి తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ అంటుంది.

Vishnupriya : నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోబోతున్న విష్ణుప్రియ?

కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ.. ‘మన స్వాతంత్య్ర ఉద్యమాన్ని, స్వాతంత్ర్య సమరయోధులను అవమానించినందుకు కంగనా రనౌత్ తన ప్రకటనపై దేశప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలి”అని డిమాండ్ చేశారు. కంగనా ప్రకటన దేశద్రోహమేనని, ఆమె ప్రకటన దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన లక్షలాది మంది ప్రజలను అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. కంగనా చెప్పినదానిని ప్రతి భారతీయ పౌరుడు వ్యతిరేకిస్తారని అన్నారు.

బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ సైతం “ఇలాంటి వ్యాఖ్యలను పిచ్చితనంగా భావించాలి.. దేశద్రోహంగా భావించాలా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు కంగనా రనౌత్. శివసేన కూడా కంగనా రనౌత్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని అన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకురాలు ప్రీతి శర్మ మేనన్‌ ముంబై కంగనాపై దేశద్రోహం కేసు పెట్టాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Kangana Ranaut : 2014లో స్వాతంత్ర్యం.. 1947లో లభించింది భిక్ష : కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు