Congress: డిజిటల్ సభ్యత్వాలతో కాంగ్రెస్‌కు జోష్

డిజిటల్ సభ్యత్వాల నమోదులో కాంగ్రెస్ మంచి గణాంకాలనే నమోదు చేసింది. ఇప్పటివరకు డిజిటల్‌గా 2.6 కోట్ల మంది సభ్యత్వాలు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రకటించింది.

Congress: డిజిటల్ సభ్యత్వాలతో కాంగ్రెస్‌కు జోష్

Congress

Congress: డిజిటల్ సభ్యత్వాల నమోదులో కాంగ్రెస్ మంచి గణాంకాలనే నమోదు చేసింది. గత ఏడాది నవంబర్‌ 1న ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటివరకు డిజిటల్‌గా 2.6 కోట్ల మంది సభ్యత్వాలు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రకటించింది. డిజిటల్ పద్ధతిలో కాంగ్రెస్ మెంబర్‌షిప్ కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది నుంచి వరుసగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Congress party: పీకేకు కాంగ్రెస్‌లో ఏ పదవి ఇవ్వబోతున్నారు? సీనియర్ల కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది?

కాంగ్రెస్ డేటా అనలిస్టిక్ డిపార్ట్‌మెంట్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ‘‘సభ్యత్వ నమోదు కోసం నాలుగు అంచెల ప్రక్రియను అనుసరించాం. పార్టీ అనుమతించిన నాయకులు మాత్రమే ఈ సభ్యత్వ నమోదు చేపట్టారు. పూర్తి పారదర్శకంగా ఈ కార్యక్రమం సాగింది. ఓటీపీ, వోటర్ ఐడీ ఆధారంగా, కార్యకర్తల ఫొటో తీసుకుని సభ్యత్వం ఇచ్చాం’’ అని ప్రవీణ్ చెప్పారు. ఈ కార్యక్రమం మరికొంతకాలం సాగుతుందని ఆయన అన్నారు.