Karnataka: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడి వింత చర్య.. ఎన్నికల ర్యాలీలో రూ.500 నోట్లు వెదజల్లిన వైనం

ఒక ఎన్నికల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. బస్సుపై ప్రచారం నిర్వహిస్తూ, రూ.500 నోట్లను శివకుమార్ వెదజల్లాడు. కాంగ్రెస్ పార్టీ ‘ప్రజా ధ్వని యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది.

Karnataka: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీసహా ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే, ఒక ఎన్నికల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. బస్సుపై ప్రచారం నిర్వహిస్తూ, రూ.500 నోట్లను శివకుమార్ వెదజల్లాడు.

Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. మే 10న పోలింగ్, 13న ఫలితాలు

కాంగ్రెస్ పార్టీ ‘ప్రజా ధ్వని యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా డీకే శివకుమార్ బస్సు యాత్ర చేపట్టారు. మండ్య జిల్లా, బెవినహల్లిలో మంగళవారం ఈ బస్సు యాత్ర సాగింది. ఈ యాత్రకు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. బస్సుపై ఉన్న శివకుమార్ పై నుంచి రూ.500 నోట్లను అక్కడున్న వారిపైకి విసిరేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివ కుమార్ తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

శివ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా కూడా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధరాయమ్యతో కలిసి ఆయన సీఎం పదవి కోసం పాటుపడుతున్నారు. కర్ణాటకకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఇప్పటికే కాంగ్రెస్ 124 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది.

 

ట్రెండింగ్ వార్తలు