తూచ్ : ప్రియాంక కాదు.. వారణాసిలో మోడీపై పోటీగా ఎవరంటే? 

2019 లోక్ సభ ఎన్నికల వేళ.. యూపీలోని వారణాసి పైనే.. ఇప్పుడు అందరి దృష్టి.. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేసేది వారణాసి నుంచే..

  • Published By: sreehari ,Published On : April 25, 2019 / 08:37 AM IST
తూచ్ : ప్రియాంక కాదు.. వారణాసిలో మోడీపై పోటీగా ఎవరంటే? 

2019 లోక్ సభ ఎన్నికల వేళ.. యూపీలోని వారణాసి పైనే.. ఇప్పుడు అందరి దృష్టి.. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేసేది వారణాసి నుంచే..

2019 లోక్ సభ ఎన్నికల వేళ.. యూపీలోని వారణాసి పైనే.. ఇప్పుడు అందరి దృష్టి.. ఎందుకంటే.. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేసేది వారణాసి నుంచే.. మోడీకి పోటీగా బరిలోకి ఎవరూ దిగుతారు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వారణాసి నుంచి పోటీ చేయాలని ఉందని ఇటీవల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ తన మనస్సులోని అభిప్రాయాన్ని చెప్పారు. అప్పటినుంచి ప్రియాంకా గాంధీనే మోడీకి పోటీగా వారణాసి బరిలో దిగుతున్నారంటూ ఊహాగానాలు వచ్చాయి. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
Also Read : పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే : గంటకు మించి ఫోన్లు ఇస్తే రిస్క్

వారణాసి బరిలో కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ పోటీ చేయడం లేదని ప్రకటించింది. మోడీపై పోటీగా కాంగ్రెస్ మరో అభ్యర్థిని బరిలో నిలిపింది. అజయ్ రాయ్ తమ పార్టీ అభ్యర్థిగా పోటీలో దించింది. గోరఖ్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రవి కిషన్ పై పోటీగా మధుసూదన్ తివారీని కాంగ్రెస్ బరిలో దించింది. వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రామ్ నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26, 2019 శుక్రవారం ప్రధాని మోడీ వారణాసి స్థానానికి నామినేషన్ పేపర్లను దాఖలు చేయనున్నారు. సీనియర్ NDA నేతలు, జేడీయూ అధ్యక్షుడు, నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే సమక్షంలో మోడీ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. 

కొన్నివారాలుగా ప్రియాంక గాంధీ వాద్రా వారణాసి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారంటూ వార్తలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన సోదరిని ఎన్నికల బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారా అనే ప్రశ్న అందరిలో మెదిలింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా తాను పోటీ చేస్తానని ప్రియాంక చెప్పడంతో దాదాపు ఆమె పేరే ఖరారు అవుతుందని పార్టీ వర్గాలు భావించాయి.
Also Read : కూతురు హీరోయిన్‌గా ఏంట్రీ ఇస్తుంటే, తండ్రి మళ్ళీ ‘తండ్రి’ అయ్యాడు

కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం వెనుక నుంచే సేవలు అందించిన ప్రియాంక వాద్రా.. 2019 ఫిబ్రవరిలో ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి రావడం.. ఇంఛార్జ్ గా బాధ్యతలు చేపట్టడంతో లోక్ సభ ఎన్నికలతో పార్టీ భవితవ్యం మారిపోతుందని పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి.కానీ,  అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం.. గురువారం (ఏప్రిల్ 25, 2019) అజయ్ రామ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో ఊహాగానాలకు చెక్ పెట్టినట్టు అయింది. 

వారణాసి అభ్యర్థిగా బరిలో దిగుతున్న అజయ్ రాయ్… 2014 లోక్ సభ ఎన్నికల్లో మోడీపై పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో రాయ్ కు 68వేల 080 ఓట్లు మాత్రమే సాధించారు. వారణాసిలో మే 19 నుంచి తుది దశ ఎన్నికలు జరుగనున్నాయి.