India-China Clash: లోక్‭సభలో వరుసగా మూడో రోజు వాయిదా నోటీసు ఇచ్చిన కాంగ్రెస్

తూర్పు లడఖ్‌లోని రించెన్ లాలో ఆగస్ట్ 2020 న జరిగిన అనంతరం రెండు సైన్యాల మధ్య ఇది మొదటి భౌతిక ఘర్షణ. దీనపై గౌరవనీయమైన రక్షణ మంత్రి ఒక ప్రకటన ఇస్తే, అడగవలసిన కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి: ఈ ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? మొదట గాల్వాన్, ఇప్పుడు యాంగ్ట్సే? చైనీయులు ఏమి కోరుకుంటున్నారు?

India-China Clash: లోక్‭సభలో వరుసగా మూడో రోజు వాయిదా నోటీసు ఇచ్చిన కాంగ్రెస్

Congress gives adjournment notice in Lok Sabha for 3rd day in row on Twang clash

India-China Clash: అరుణాచల్ ప్రదేశ్‭లోని తవాంగ్ సెక్టార్‭లో ఇండియా-చైనా బలగాల మధ్య నెలకొన్ని ఉద్రిక్తపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ వరుసగా మూడవ రోజు లోక్‭సభలో వాయిదా నోటీసు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ గురువారం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కి ఈ నోటీసు అందించారు. గత మూడు రోజులుగా ఈ విషయమై చర్చించాలంటూ కాంగ్రెస్ తరపున ఆయనే ఈ నోటీసులు ఇస్తున్నారు. అయితే ఈ విషయమై చర్చ చేసేందుకు ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపడం లేదు.

Raju Safe: రాజు సేఫ్.. బండరాళ్ల మధ్యనుంచి సురక్షితంగా బయటకు.. ఫలించిన అధికారుల కృషి

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కి తివారీ ఇచ్చిన నోటీసులో “అత్యవసర ప్రాముఖ్యమైన ఒక నిర్దిష్టమైన విషయాన్ని చర్చించే ఉద్దేశ్యంతో సభా వ్యవహారాలను వాయిదా వేసేందుకు నేను నోటీసు ఇస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఒకవేళ తివారీ నోటీసుకు కనుక అంగీకరించినట్లైతే అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనాతో సరిహద్దు వద్ద ఉన్న గంభీరమైన పరిస్థితిపై సవివరంగా చర్చించేందుకు ఈ సభ జీరో అవర్‌, ప్రశ్నోత్తరాల సమయం, ఇతర వ్యవహారాలకు సంబంధించిన సంబంధిత నియమాలను సస్పెండ్ చేస్తుంది.

Politics In YCP : వైసీపీలో విభేధాలు..మంత్రి పెద్దిరెడ్డి పోస్టర్లు చింపేసిన సొంతపార్టీ కార్యకర్తలు

2020 గాల్వాన్ ఘర్షణతో పాటు యాంగ్ట్సేలో భారత్, చైనా సైన్యాల మధ్య ముఖాముఖికి సంబంధించి అనేక ప్రశ్నలను తివారీ లేవనెత్తుతూ “తూర్పు లడఖ్‌లోని రించెన్ లాలో ఆగస్ట్ 2020 న జరిగిన అనంతరం రెండు సైన్యాల మధ్య ఇది మొదటి భౌతిక ఘర్షణ. దీనపై గౌరవనీయమైన రక్షణ మంత్రి ఒక ప్రకటన ఇస్తే, అడగవలసిన కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి: ఈ ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? మొదట గాల్వాన్, ఇప్పుడు యాంగ్ట్సే? చైనీయులు ఏమి కోరుకుంటున్నారు? ప్రభుత్వానికి చైనా ప్రయత్నాల గురించి తెలుసా? చైనా దురుద్దేశాలు, దురాక్రమణల ఫలితంగా మనం ఏదైనా భూభాగాన్ని కోల్పోయామా? ఒకవేళ కోల్పోతే దానిని తిరిగి పొందడానికి ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుంది?” అని రాసుకొచ్చారు.