RSS ఆఫీస్ కు భద్రతను పునరుద్దరించిన కమల్ నాథ్

  • Published By: venkaiahnaidu ,Published On : April 2, 2019 / 03:11 PM IST
RSS ఆఫీస్ కు భద్రతను పునరుద్దరించిన కమల్ నాథ్

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని RSS కార్యాలయానికి రాత్రికి రాత్రి సెక్యూరిటీని తొలగించిన సీఎం కమల్ నాథ్ ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రభుత్వ ఉత్తర్వును ఉపసంహరించారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను పునరుద్ధరించారు.ఎన్నికల కారణంగా అదనపు బలగాల అవసరం ఉండటంతో కొన్ని కార్యాలయాలకు భద్రతను ఉపసంహరించామని, వాటిలో ఆర్ఎస్ఎస్ ది కూడా ఒకటి ఉందని తన దృష్టికి వచ్చిందని, దీనిపై ఈసీకి ఫిర్యాదు కూడా వెళ్లినట్టు తనకు తెలిసిందని కమల్ నాథ్ తెలిపారు.నిజానికి తాము భద్రతను కోరలేదని ఒకసారి, ఎందుకు భద్రత ఉపంసంహరించారంటూ మరోసారి బీజేపీ మాట్లాడుతుండటం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కమల్‌నాథ్ విమర్శించారు.

భోపాల్‌ లోని అరెరా కాలనీలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం దగ్గర భద్రతగా ఉండే సాయుధ ఎస్ఏఎఫ్ సిబ్బందిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉపసంహరించింది. దీనిపై ఆర్ఎస్ఎస్ వాలంటీర్ ఒకరు ఈసీకి కంప్లెయింట్ చేశారు.ప్రభుత్వ చర్యపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు కూడా ఆయన హెచ్చరించారు. దీంతో బీజేపీ నేతలు సైతం రంగంలోకి దిగారు.

అయితే ఇదే సమయంలో భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దిగ్విజయ్ సింగ్ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను ఉపసంహరించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని ట్వీట్ చేశారు.వెంటనే కమల్ నాథ్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కు సెక్యూరిటీని పునరుద్దరించాలని ట్వీట్ చేశారు.సొంతపార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండటంతో  మంగళవారం మధ్యాహ్నం కమల్ నాథ్ ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించారు.