Sonia Gandhi : దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోన్న మోదీ ప్రభుత్వం : సోనియా గాంధీ

దేశాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ మతప్రాతిపదికన విభజించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపించారు. దేశంలో ఉన్న మైనారిటీలను టార్గెట్ చేసి దాడులు పెంచారని విమర్శించారు. మైనారిటీలు కూడా దేశంలో ఒక భాగం అన్న విషయాన్ని అందరూ గుర్తు ఉంచుకోవాలన్నారు.

Sonia Gandhi : దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోన్న మోదీ ప్రభుత్వం : సోనియా గాంధీ

Sonia Gandhi (1)

Sonia Gandhi : ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మైనార్టీ, గిరిజనుల పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని చెప్పారు. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్ లో సోనియా గాంధీ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. మోడీ పాలన కొనసాగితే దేశం దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు.

చింతన్ శివిర్ వేదిక ద్వారా పార్టీ ఐక్యత, దేశ సమగ్రత, ఆత్మ విశ్వాసం, నిబద్దతతో ముందుకు వెళుతున్నాం.. అనే సందేశం వెళ్ళాలి అని సోనియాగాంధీ పిలుపునిచ్చారు. దేశాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ మతప్రాతిపదికన విభజించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపించారు. దేశంలో ఉన్న మైనారిటీలను టార్గెట్ చేసి దాడులు పెంచారని విమర్శించారు. మైనారిటీలు కూడా దేశంలో ఒక భాగం అన్న విషయాన్ని అందరూ గుర్తు ఉంచుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతలపైకి విచారణ సంస్థలను ఉసిగొల్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. గాంధీని చంపిన వారిని కీర్తి ప్రతిష్టలతో పొగుడుతూ హీరోలుగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు.

Sonia Gandhi: ప్రజాస్వామ్యానికి ఫేస్ బుక్ ప్రమాదకరం – సోనియా గాంధీ

నెహ్రూ నెలకొల్పిన సంస్థలన్నిటినీ ధ్వంసం చేస్తూ వ్యవస్థలపై ఉన్న జ్ఞాపకాలను తుడిచేస్తున్నారని మండిపడ్డారు. సెక్యులరిజంపై దాడి చేస్తూ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలు, దళితులు, మహిళలపై రోజు రోజుకీ దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని కార్పొరేషన్ చేస్తూ అన్ని వర్గాల వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా జీవించాలి… అందుకు అనుగుణంగా వాతావరణం పునరుద్ధరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. అందుకు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితిని అయినా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

2016 నుంచీ దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారి పోయిందన్నారు. నోట్ల రద్దు తర్వాత ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. MSMEలు తీవ్రంగా నష్ట పోయాయని తెలిపారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని, జాతీయ భద్రతా చట్టాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతుల పోరాటానికి దిగి వచ్చి.. నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నా… సమస్యలు పరిష్కారం మాత్రం కాలేదన్నారు.

Sonia Gandhi: 400మందితో సిడబ్ల్యుసి సమావేశానికి సోనియాగాంధీ

మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో విద్వేష వాతావరణాన్ని పెంచుతున్నారని విమర్శించారు. దీని వల్ల సమాజంలో తీవ్రమైన దుష్పరిణామాలు వస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలో సామరస్యతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక,రైతాంగ, ఉపాధి, పార్టీ సంస్థాగత ప్రక్షాళన అంశాలపై బృందాలుగా కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారభించారు. చర్చలు బయటకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చర్చలు జరిగే ప్రాంతంలోకి నేతల ఫోన్లకు అనుమతి లేదు. మూడు రోజుల పాటు చింతన్ శివిర్ సాగనుంది.