Jodo Yatra : ఇండోర్‌లో రాహుల్ పాదయాత్రలో తొక్కిసలాట .. సీనియర్ నేత వేణుగోపాల్ కు గాయాలు

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రాహుల్ ను చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు చేతికి,మోకాలికి గాయాలయ్యాయి.

Jodo Yatra : ఇండోర్‌లో రాహుల్ పాదయాత్రలో తొక్కిసలాట .. సీనియర్ నేత వేణుగోపాల్ కు గాయాలు

KC Venugopal injured in stampede during Bharat Jodo Yatra

Jodo Yatra : మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. రాహుల్ ను చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భారీగా వచ్చిన జనాలను నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు చేతికి,మోకాలికి గాయాలయ్యాయి. వేణుగోపాల్ తో పాటు పలువురికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడినవారికి పాదయాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రథమ చికిత్స అందిస్తున్నారు.

ఈక్రమంలో బీజేపీపై కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి బీజేపీ ఓర్చుకోలేకపోతోందని…. తమ యాత్ర పరువు తీసేందుకు యత్నిస్తోందని ఈ ఘటన కూడా బీజేపీ కుట్రలో భాగమేనంటూ ఆరోపించారు. రాహుల్ కు అప్రతిష్ట తీసుకొచ్చేందుక బీజేపీ గత కొన్నేళ్లుయా ఎంతో ప్రయత్నించిందని ఆరోపించారు. ఈ పాద యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న బీజేపీ వైఫల్యాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు.

కాగా..మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో “పాకిస్తాన్ జిందాబాద్” నినాదాలు లేవనెత్తిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత వేణుగోపాలు ఈ ఆరోపణలు చేశారు. రాహుల్ యాత్ర చేపట్టినప్పటినుంచి బీజేపీ భరించలేక అర్థం పర్థం లేని విమర్శలు చేస్తోందని..పాదయాత్రలో ఏదో చేయటానికి కుట్రలు చేస్తోంది అంటూ వేణుగోపాల్ ఆరోపించారు. నిరుద్యోగం,ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై దేశంలోని యువత నిరాశకు గురవుతున్నారని ఇటువంటి తరుణంలో దేశంలో భారత్ జోడో యాత్ర తరహా మార్చ్‌కు “అత్యవసరం” ఉందని అన్నారు.