Anil K Antony: కాంగ్రెస్ పార్టీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన ఏకే ఆంటోని తనయుడు

ప్రధాని మోదీపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అని బీజేపీపై మండిపడ్డాయి.

Anil K Antony: కాంగ్రెస్ పార్టీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన ఏకే ఆంటోని తనయుడు

Anil K Antony: కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ సీఎం ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని మోదీపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీని నిషేధించింది.

Gujarat: గుజరాత్‌లో ఢిల్లీ తరహా ఘటన.. యువకుడిని ఢీకొని 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు.. యువకుడు మృతి

ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అని బీజేపీపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఏకే ఆంటోని తనయుడు మాత్రం బీజేపీ నిర్ణయానికి మద్దతు పలికాడు. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించడం సరికాదని ట్వీట్ చేశాడు. దేశంలో బీజేపీతో బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ, భారతీయ వ్యవస్థలపై బ్రిటన్ సంస్థ అభిప్రాయాలు వెల్లడించడం మన సార్వభౌమాధికారాన్ని అణగదొక్కడమే అవుతుందని వెల్లడించాడు. బయటి సంస్థలు మన దేశంలో విభజనకు ప్రయత్నించకూడదని ఆయన వ్యాఖ్యానించారు.

Chiris Hipkins: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్ ప్రమాణ స్వీకారం.. 41వ ప్రధానిగా బాధ్యతల స్వీకరణ

ఈ వ్యాఖ్యల ద్వారా బ్రిటన్‌కు చెందిన బీబీసీ సంస్థ మోదీపై డాక్యుమెంటరీ రూపొందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేత అయిన అనిల్ ఆంటోనీ పరోక్షంగా ప్రధానికి మద్దతుగా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీసింది. అనేక మంది పార్టీ నేతలు అనిల్ ఆంటోనిపై విమర్శలు గుప్పించారు. తన ట్వీట్ తొలగించాలని సూచించారు. మోదీ విషయంలో తన అభిప్రాయాలు వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

Pawan Kalyan: ఇంద్రకీలాద్రికి పవన్ కల్యాణ్… ‘వారాహి’కి వాహన పూజ చేయించిన జనసేనాని

‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న వాళ్లే తన ట్వీట్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను దీనికి అంగీకరించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని బాధ్యతల నుంచి తప్పుకొంటున్నాను’’ అని అనిల్ ఆంటోనీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఏకే ఆంటోని.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాత్రమే కాకుండా.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.