Congress: కాంగ్రెస్‭కు మరో కీలక నేత పార్టీకి గుడ్ బై.. వరుస రాజీనామాలో కుదేలవుతోన్న పార్టీ

వరుస రాజీనామాలతో కుదేలవుతున్నకాంగ్రెస్ పార్టీకి తాజాగా కూడా మరింత గుదిబండగా మారుతోంది. జ్యోతిరాదిత్య సింధియా, ఆర్పీ సింగ్, జితిన్ ప్రసాద, హార్ధిక్ పటేల్, కపిల్ సిబల్ వంటి వారు మొత్తమే పార్టీని వీడుతుండగా.. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ లాంటి వారు పార్టీల్లోని పదవులకు రాజీనామా చేయడం కూడా పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది.

Congress: కాంగ్రెస్‭కు మరో కీలక నేత పార్టీకి గుడ్ బై.. వరుస రాజీనామాలో కుదేలవుతోన్న పార్టీ

Congress leader Jaiveer Shergill resigns from the post of National Spokesman of the Congress party

Congress: కాంగ్రెస్ పార్టీని రాజీనామా దెబ్బలు వదలడం లేదు. తాజాగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెర్గిల్ రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులతోపాటు ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. వెళ్తూ వెళ్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు షెర్గిల్. పార్టీ అధిష్టానం మొత్తం భజనపరుల కోటరీగా మారిందని, ప్రజా ప్రయోజనాల కోసం పార్టీ పాటుపడే పరిస్థితి కనిపించలేదంటూ ధ్వజమెత్తారు.

Raja Singh Row: రాజాసింగ్ ఎక్కడ కనిపిస్తే అక్కడే కొట్టండి.. కాంగ్రెస్ నేత వివాదాదస్పద వ్యాఖ్యలు

‘‘ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేశాను. నేను పార్టీ నుంచి తీసుకున్నదేమీ లేదు. అధిష్టానం అడుగులకు మడుగులొత్తే వారికి అందలాలు దక్కుతున్నాయి. పార్టీ అధిష్టానం మొత్తం భజనపరుల కోటరీగా మారింది. ఏడాదిగా పార్టీ అధినేత సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలను సమయం కోరుతున్నాను. కానీ ఒక్కసారి కూడా నా విజ్ణప్తిని స్వీకరించి కార్యాలయానికి పిలవలేదు’’ అని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

TMC remove tripura president: ఎన్నికల ముందు పార్టీ రాష్ట్ర చీఫ్ ఔట్.. బై-ఎలక్షన్ దెబ్బే అంటున్న నేతలు

జాతీయ మీడియాలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అధికార ప్రతినిధిగా పార్టీ అభిప్రాయాలను బలంగా వినిపించే నేతగా పేరున్న జైవీర్ షెర్గిల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు న్యాయవాదిగానూ మంచిపేరు తెచ్చుకున్న షెర్గిల్‌ పార్టీని వీడటం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జైవీర్ షెర్గిల్ ఏ పార్టీలో చేరతారనేది ఇంకా స్పష్టం కాలేదు.

Bilkis Bano case: బిల్కిస్ బానో నిందితుల విడుదల తప్పిదం: సొంత పార్టీపై బీజేపీ సీనియర్ నేత విమర్శలు

వరుస రాజీనామాలతో కుదేలవుతున్నకాంగ్రెస్ పార్టీకి తాజాగా కూడా మరింత గుదిబండగా మారుతోంది. జ్యోతిరాదిత్య సింధియా, ఆర్పీ సింగ్, జితిన్ ప్రసాద, హార్ధిక్ పటేల్, కపిల్ సిబల్ వంటి వారు మొత్తమే పార్టీని వీడుతుండగా.. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ లాంటి వారు పార్టీల్లోని పదవులకు రాజీనామా చేయడం కూడా పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలను అదుపు చేయలేకపోవడం, భవిష్యత్తుపై విశ్వాసాన్ని కల్పించలేకపోవడం వంటి కారణాలే కాంగ్రెస్ పార్టీని వేటాడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.